BSP Party: ఎమ్మెల్సీ కవిత అరెస్టు పైన బీఎస్పీ పార్టీ రియాక్షన్ ఇదే

  • Written By:
  • Updated On - March 15, 2024 / 09:55 PM IST

BSP Party: బిఆర్ఎస్ చీఫ్, మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను ఈడీ అరెస్టు చేయడం పట్ల దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ‘కేసీఆర్ తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా, అదేస్థాయిలో ఉన్న బిజెపి-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీ తో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే మోడీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కు తెర తీశాడు. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదు’’ అని తేల్చి చెప్పింది.

‘‘ఈ లాంటి అక్రమ అరెస్ట్ ల తో అదిరేది బెదిరేది లేదు. బెదిరితే తెలంగాణ వచ్చేదా కాదు. ఈ దుశ్చర్య కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందంలో భాగమే. ఈడీ తో బిజెపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్ట్ ను తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించి ఈ రెండు దోపీడీ దొంగల పార్టీలకు రేపు జరగబోతున్న భారత పార్లమెంట్ ఎన్నికల్లో తిరగబడి తగిన బుద్ధి చెప్పబోతున్నారు. దేశంలో మోడి పాలన నాటి నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉంది. మొన్న సాయిబాబా సిసోడియా, నిన్న హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేనో…? అందుకే తెలంగాణ సమాజం, యావత్తు దేశం బీజేపీని తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉంది’’ అంటూ బీఎస్ పీ రియాక్ట్ అయ్యింది.