Jawan Kidnap: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో తీవ్ర ఉద్విగ్నతకు కారణమైన సంఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన దుండగులు ఓ భారత బీఎస్ఎఫ్ జవాన్‌ను అపహరించి కొన్ని గంటల పాటు బందీగా ఉంచిన ఘటన కలకలం రేపుతోంది. బీఎస్ఎఫ్ అధికారుల వెంటనే స్పందనతో పాటు బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ (బీజీబీ) సహకారంతో ఆ జవాన్‌ను సురక్షితంగా విడుదల చేయించగలిగారు.
Bangalore : తొక్కిసలాట ఘటన.. మధ్యాహ్నం కర్ణాటక హైకోర్టులో విచారణ
ఈ ఘటన ముర్షిదాబాద్ జిల్లాలోని సుతిర బీఎస్ఎఫ్ క్యాంప్ సమీపంలోని చాందినీచౌక్ వద్ద తెల్లవారుజామున జరిగింది. బంగ్లాదేశ్ వైపు నుండి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన కొందరు వ్యక్తులను ఓ బీఎస్ఎఫ్ జవాన్ గమనించి అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో దుండగులు అతనిపై దాడి చేసి బలవంతంగా తమతో పాటు బంగ్లాదేశ్ భూభాగంలోకి తీసుకెళ్లారు. ఈ దుండగులు చపాయ్ నవాబ్‌గంజ్ ప్రాంతానికి చెందినవారిగా అనుమానిస్తున్నారు.
జవాన్ అపహరించబడిన సమాచారాన్ని అందుకున్న వెంటనే బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. బీజీబీతో సంప్రదింపులు జరిపి, వారి జోక్యంతో గంటల వ్యవధిలోనే జవాన్‌ను విడుదల చేయించారు. “అతను ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు,” అని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
జవాన్‌ను అరటి చెట్టుకు కట్టేసి ఉన్నట్లు చూపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై బీఎస్ఎఫ్ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. భద్రతా లోపాలపై సమీక్ష చేస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇటీవల ముర్షిదాబాద్ ప్రాంతం ద్వారా బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్ల పెరుగుదలపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏప్రిల్‌లో ఈ ప్రాంతంలో జరిగిన అల్లర్లకు కూడా విదేశీ చొరబాటుదారుల హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. తాజా ఘటనతో ఈ ఆరోపణలకు బలంగా నిలుస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమస్యను జాతీయ భద్రతాపై ప్రభావం చూపే అంశంగా భావిస్తున్నారు. ఈ దాడితో పాటు సరిహద్దు భద్రతలపై మరింత అప్రమత్తత అవసరం ఏర్పడింది. దేశ భద్రతను కాపాడే బీఎస్ఎఫ్ జవాన్లపై జరుగుతున్న ఇలాంటి దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.
Telangana Cabinet : కాసేపట్లో క్యాబినెట్ భేటీ.. వీటిపై కీలక నిర్ణయం!