Site icon HashtagU Telugu

TS Polls : బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి చేరిన ముగ్గురు కౌన్సిలర్లు..

Brs Councillors Joins Congr

Brs Councillors Joins Congr

ఎన్నికల పోలింగ్ (Telangana Elections) సమయం దగ్గర పడుతున్న కొద్దీ..అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత వరుసపెట్టి నేతలంతా కాంగ్రెస్ (Congress) గూటికి చేరుతుండగా..ఈ వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది చేరగా..తాజాగా సంగారెడ్డి (Sangareddy) మున్సిపాలిటీ పాలకవర్గం నుండి ముగ్గురు కౌన్సిలర్లు (Councillors) బిఆర్ఎస్ కు రాజీనామా చేసి ..కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 7వ వార్డు కౌన్సిలర్ బోయిని విజయలక్ష్మి శేఖర్, 19వ వార్డుకు చెందిన చాకలి స్వప్న నర్సింహులు, 28వ వార్డు కౌన్సిలర్ ఉమామహేశ్వరీలు మంగళవారం కాంగ్రెస్ లో చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే సదాశివపేట, సంగారెడ్డి మండలాల నుంచి పలువురు బీఆర్ఎస్ నాయకులు జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరు మాత్రమే కాదు తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ సైతం తమ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలని పిలుపునిచ్చారు.

Muslim Jac

Muslim Jac2

Read Also : Pawan Kalyan Election Campaign : రేపటి నుండి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ బిజీ బిజీ