Site icon HashtagU Telugu

Kavitha : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు

MLC Kavitha

MLC Kavitha

BRS MLC Kavitha : ఎట్టకేలకు ఈడీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు అయ్యింది. సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీం కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి  కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయ్యి తిహార్‌ జైలులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. కవిత తరుఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మరో 15మందికిపైగా ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలోనే మకాం వేశారు. కవిత పలుమార్లు అస్వస్థతకు గురవడం, ఈకేసులో ఈడీ విచారణకు హాజరుకాకపోవడం వంటి పరిణామాలు చూస్తుంటే కవితకు బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తోందని ఆపార్టీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. కవిత మార్చి 15వ తేదీ నుంచి తీహార్‌ జైల్లో ఉన్నారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న వారికి వరుసగా బెయిళ్లు వస్తున్నాయి. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఈ మధ్యే బెయిల్ వచ్చింది. క‌విత త‌ర‌ఫున ప్రమఖ లాయర్ ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ముకుల్ రోహత్గీ తన వాదనలో కీలకాంశాలు ప్రస్తావించారు. ఇప్పటికే కవిత అరెస్టు అయ్యి 5 నెలలు దాటిందని కోర్టుకు తెలియజేశారు. ఈడీ కేసులో ఐదు నెలలు, సీబీఐ కేసుల్లో నాలుగు నెలలు జైల్లో ఉన్నట్టు వివరించారు. ఈడీ, సీబీఐ విచారణ కూడా పూర్తైందని ఛార్జ్‌ షీట్లు కూడా వేశారన్నారు. 493 మంది సాక్షులను కూడా దర్యాప్తు సంస్థలు విచారించాయని తెలిపారు. ఇప్పటికిప్పుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదని, దేశం విడిచిపెట్టి వెళ్లిపోయే ఛాన్స్ కూడా లేదన్నారు. చాలా మంది ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తుంటారని దాన్నే పెద్ద నేరంగా చెప్పడం సరికాదన్నారు. వంద కోట్లు చేతులు మారినట్టు దర్యాప్తు సంస్థలు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నాయని తెలిపారు. ఒక్క పైసా కూడా రికవరీ చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని కోర్టుకు అభ్యర్థించారు.

Read Also: Hydra : హైడ్రా కూల్చివేతలు.. కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటి వద్ద భద్రత పెంపు

ఈడీ తరఫున వాదనలు వినిపించిన ఎస్వీ రాజు కూడా కీలకాంశాలు ప్రస్తావించారు. కవితకు ఈడీ నోటీసులు వచ్చిన వెంటనే ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపారు. అందులో సమాచారం పూర్తిగా ధ్వంసమైనట్టు వెల్లడించారు. వాటిని ఫార్మాట్ చేసి ఇంట్లో పని మనుషులకు ఇచ్చారని అన్నారు. విచారణ సమయంలో కవిత దర్యాప్తు అధికారులకు సహకరించలేదని కోర్టుకు తెలిపారు.

ఫోన్ల ప్రస్తావన వచ్చినప్పుడు సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చాలా మంది ఫోన్లు, కార్లు మారుస్తారని కవిత తరఫున న్యాయవాది వాదిస్తుంటే… రోజూ ఇలా మారుస్తారా అని ప్రశ్నించారు. ఫోన్లు మార్చడం కామన్ కాదన్న ఈడీ న్యాయవాది.. ఈ కేసులో కావాలనే సాక్ష్యాలను కవిత నాశనం చేశారన్నారు. ఫోన్లలో డేటాను డిలీట్ చేయడం వేరు పూర్తిగా తుడిచివేయడం వేరని అన్నారు. కవిత మాత్రం కావాలనే ఫోన్లను ఫార్మాట్ చేశారని ఆమె ఇచ్చిన ఫోన్లలో పది రోజుల డేటా మాత్రమే రికవరీ చేయగలిగామని ఈడీ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Read Also: Kangana Ranaut : కంగన ‘ఎమర్జెన్సీ’కి వ్యతిరేకంగా వీడియో వార్నింగ్.. అందులో ఏముంది?