కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ (Telangana Budget 2024) ఫై బిఆర్ఎస్ (BRS) ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బడ్జెట్లో భట్టి వట్టి మాటలు చెప్పారని.. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, భట్టి చేసిన బడ్జెట్ ప్రసంగం ఓ కథలా, రాజకీయ ప్రసంగంలా ఉందని పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అంటుంటే..రాష్ట్ర బడ్జెట్ గ్యారెంటీలను గంగలో కలిపిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు.
తెలంగాణ వార్షిక బడ్జెట్ (Telangana Budget 2024 – 25) ను గురువారం అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ప్రవేశ పెట్టారు. మొత్తం రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ను శాసనసభలో ప్రవేశ పెట్టగా ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. అలాగే పలు శాఖలకు నిధులు కేటాయిస్తున్నట్లు ఆ వివరాలు పేర్కొన్నారు. భట్టి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఫై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభకు హాజరైన కేసీఆర్..బడ్జెట్‌పై మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ విధానపరంగా లేదని , బడ్జెట్లో దళితబంధు ప్రస్తావనే లేదని, ప్రభుత్వం దళితుల గొంతు కోసిందని ఆరోపించారు. బడ్జెట్లో భట్టి వట్టి మాటలు చెప్పారని.. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్యారెంటీలను గంగలో కలిపిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని, ఇది పూర్తిగా కోతల, ఎగవేతల బడ్జెట్ ఆయన మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో ఎన్నికల వాగ్ధానాలను గాలికి వదిలేసి ప్రజలను వంచించారని ఆరోపించారు. ఇది డిక్లరేషన్‌లను బుట్టదాఖలు చేసిన దోకేబాజ్ బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘ఆడబిడ్డలు, అవ్వాతాతలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు బడ్జెట్లో మొండిచేయి చూపారు. నిరుద్యోగ భృతి లేదు, విద్యా భరోసా లేదు, ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలు, ఆటో అన్నలను ఆదుకోవాలన్న మానవీయ కోణమే లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
ఇక హరీష్ రావు (Harish Rao) సైతం బడ్జెట్ ఫై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.ఎన్నికలప్పుడు గ్యారెంటీల గారడీ.. ఇప్పుడేమో అంకెల గారడీ అంటూ బడ్జెట్‌పై హరీశ్‌రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మొదటి బడ్జెట్. ఈ బడ్జెట్‌లో దశదిశ ఇస్తారు అనుకున్నాం కానీ దశదిశ ఇవ్వలేదు. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటటువంటి బడ్జెట్ ఇది. ఆరు గ్యారెంటీలు నీరు గారిపోయాయి. సంక్షేమం సన్నగిల్లింది. అభివృద్ధి అగమ్యగోచరమైంది. అన్ని వర్గాలను తీవ్ర నిరాశ పరిచింది అన్నారు.
ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!
గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..!
వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్..!
డిక్లరేషన్‌లను బుట్టదాఖలు చేసిన…దోకేబాజ్ బడ్జెట్..!
విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో
ఏమార్చిన డొల్ల బడ్జెట్..!రైతులకు…
— KTR (@KTRBRS) July 25, 2024
Read Also : Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొనాలనుకుంటున్న ఛానెల్ జీరో రేటింగ్‌లో ఉందా..?
