Site icon HashtagU Telugu

Ponguleti: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేసి అప్పుల ఊబిలోకి నెట్టింది : పొంగులేటి

Ponguleti

Ponguleti

Ponguleti: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం మండిపడ్డారు. పాలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజాపరిపాలన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆరు హామీల అమలు దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆరు హామీలను ఆమోదించినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజా పాలన నడుస్తోందన్నారు.

తమ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆరు హామీలకు సంబంధించి రెండు అంశాలకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని, దశలవారీగా హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ ప్రభుత్వం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. పదేళ్లలో తెలంగాణ ఎంత అప్పుల్లో కూరుకుపోయిందో ఇప్పటికే ప్రజల్లో చర్చ జరిగిందన్నారు. ప్రజల అభీష్టం కు వ్యతిరేకంగా  కేసీఆర్ అప్పులు చేసి ప్రజల సొమ్ముతో పెద్ద ఫామ్ హౌస్ కట్టించుకున్నారని విమర్శించారు.

Also Read: Nara Lokesh: శ్రీకాళ‌హ‌స్తి త‌వ్వ‌కాల‌కు కార‌కులైనవారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి: నారా లోకేశ్