Site icon HashtagU Telugu

BRS Party : ఎమ్మెల్యేల అనర్హత పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్

Brs Approached Supreme Cour

Brs Approached Supreme Cour

BRS Party : ఎమ్మెల్యేల అనర్హత పై బీఆర్‌ఎస్‌ పార్టీ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. ముఖ్యంగా ఏడుగురు ఎమ్మెల్యేల పై రిట్ పిటిషన్ వేసింది. ముగ్గురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లాం వెంకట్రావు పై SLP వేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాద‌య్య‌, డాక్ట‌ర్ సంజ‌య్, అరికెపూడి గాంధీ, ప్ర‌కాశ్ గౌడ్, మ‌హిపాల్ రెడ్డి, కృష్ణ‌మోహ‌న్ రెడ్డిపై రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. 10 మంది ఎమ్మెల్యేల‌పై ఫిర్యాదు చేసిన 9 నెల‌లు అవుతున్నా.. స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోలేద‌ని బీఆర్ఎస్ పేర్కొంది.

హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని బీఆర్ఎస్ తెలిపింది. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొంది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలుచేయాలని కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘా చంద్ర కేసులో తీర్పు రాగా మేఘా అందుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని ఆరోపించింది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టుకు బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేసింది.

Read Also: HMPV ఇన్ఫెక్షన్ నుండి సురక్షితంగా ఎలా ఉండాలో తెలుసుకుందాం..