Bride Cancel Marriage: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. వెంటనే తాళి తెంపి అలా?

ఈ మధ్యకాలంలో యువత ప్రేమ అన్న మోజులో పడి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం కోసం సమాజాన్ని తల్లిదం

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 08:55 PM IST

ఈ మధ్యకాలంలో యువత ప్రేమ అన్న మోజులో పడి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం కోసం సమాజాన్ని తల్లిదండ్రులను ఎదిరించి మరి పెళ్లిళ్లు చేసుకుని ఒకటవుతున్నారు. కానీ ఆ పెళ్లి మూడు నాలుగు ముచ్చటే అవుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగా ఒకరినొకరు చంపుకోవడం వేధించుకోవడం లేదంటే విడాకులు తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ఒక అమ్మాయి కూడా ప్రేమించిన అబ్బాయితో పెళ్లికి నిరాకరించడంతో ఇంటి నుంచి పారిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకుంది.

కానీ ఇంతలోనే ప్రియుడికి షాక్ ఇస్తూ తాళి తీసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలేం జరిగిందంటే.. తిరుపూర్ పూండి రింగ్ రోడ్డు కు చెందిన 23 ఏళ్ల యువతీకి కొంతకాలం కిందట కోయంబత్తూరు జిల్లా అన్నూర్ ఓటర్ పాలయం కు చెందిన 29 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కొద్ది రోజులకి ప్రేమగా మారింది. అలా ఇద్దరు కలిసిపోవడం మాట్లాడుకోవడం చట్టపట్టలేసుకొని తిరగడం మొదలుపెట్టారు. ఇక ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్న విధంగానే ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా యువతి తరపు బంధువులు మాత్రం పెళ్లికి అంగీకరించలేదు.

కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఓకే చెప్పారు. ఆమె ప్రియుడిని వదిలి ఉండలేకపోయింది. దాంతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అనుకున్న విధంగానే తన తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి పారిపోయింది. వెళ్తూ ఇంట్లో ఉన్న ఐదున్నర సవర్ల బంగారు నగలతో పాటు ఐదు లక్షల నగదును కూడా తీసుకొని ప్రియుడి దగ్గరికి వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం రక్షణ కల్పించాలి అని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు ఆ జంటను పిలిపించగా తల్లిదండ్రులు కూతుర్ని చూసి బోరున విలపించడంతో వెంటనే అది చూసి ఆ యువతి మనసు కరిగిపోయింది. దాంతో ఆమె మనసు మార్చుకొని ప్రియుడిది తప్పు లేదని చెప్పి తాళి తీసేసి ఇచ్చి తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. అనంతరం పోలీసులు ఆ యువకుడికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు..