Karnataka: పావురాన్ని కాపాడే క్రమంలో విద్యుదాఘాతంతో మైనర్ మృతి

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ మైనర్ మృతి చెందాడు. కరెంటు తీగలో చిక్కుకున్న పావురాన్ని రక్షించేందుకు బాలుడు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

Karnataka: స్తంభంపై ఇరుక్కుపోయిన పావురాన్ని రక్షించేందుకు బాలుడు కరెంటు స్తంభం ఎక్కుతుండగా లైవ్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. రాంపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలలోకి వెళితే..

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ మైనర్ మృతి చెందాడు. కరెంటు తీగలో చిక్కుకున్న పావురాన్ని రక్షించేందుకు బాలుడు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని హనుమాన్‌పురా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మృతుడు ఆరో తరగతి చదువుతున్న రామచంద్ర (12)గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్ స్తంభంపై ఉన్న హైటెన్షన్ వైరుపై పావురం ఇరుక్కుపోయి ఉండటాన్ని బాలుడు చూశాడు. ధైర్యంగా బాలుడు పావురాన్ని రక్షించేందుకు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురయ్యాడు. బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మృతదేహం స్తంభానికి వేలాడుతూ ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రాంపుర పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: International Self Care Day 2024 : మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలి.? స్వీయ సంరక్షణ దినోత్సవం అంటే.?

Follow us