శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్ (Bomb Threat Grounds Indigo Flight) కలకలం రేపింది. కోయంబత్తూరు , చెన్నై వయా హైద్రాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం తో అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు( Rajiv Gandhi International Airport)లో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. దాపు ఆరుగంటల పాటు విమానాన్ని చెక్ చేసి.. అనంతరం ఏమీ లేదనే నిర్ధారణకు వచ్చారు.
ఆ ఇండిగో విమానంలో మొత్తం 181 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల కొంతమంది ఆకతాయిలు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ చేయడం ఎక్కువైపోయింది. గతంలోనూ ఇలాంటి ఫేక్ బెదిరింపు కాల్స్ చేయడం..మెయిల్స్ చేయడం చేసి అధికారులను పరుగులు పెట్టించారు. ఈరోజు కూడా అదే చేసారు.
Read Also : BJP Leaders : ఏపీలో బయటపడుతున్న బిజెపి నేతల రాసలీలల వీడియోలు