Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా 40 మంది నేతలకు చోటు దక్కింది. ఈ నేతలంతా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు.
ఈ జాబితాలో ఈ నేతలకు చోటు దక్కింది:
40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ విడుదల చేసింది. అందులో మొదటి పేరు ప్రధాని మోదీది. దీని తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్లు ఉన్నాయి. దీంతో పాటు కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలకు కూడా జాబితాలో చోటు కల్పించారు.
బీఎస్ యడ్యూరప్ప- కర్ణాటక మాజీ సీఎం
నళిన్ కుమార్ కటీల్ – కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు
బసవరాజ్ బొమ్మై – కర్ణాటక ముఖ్యమంత్రి
నిర్మలా సీతారామన్ – కేంద్ర ఆర్థిక మంత్రి
ప్రహ్లాద్ జోషి – కేంద్ర మంత్రి
స్మృతి ఇరానీ – కేంద్ర మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్ – కేంద్ర మంత్రి
మన్సుఖ్ మాండవియా – కేంద్ర మంత్రి
డీవీ సదానంద గౌడ- కర్ణాటక మాజీ సీఎం
యోగి ఆదిత్యనాథ్ – యూపీ ముఖ్యమంత్రి
శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
హిమంత బిస్వా శర్మ – అస్సాం ముఖ్యమంత్రి
దేవేంద్ర ఫడ్నవీస్ – మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 10న ఓటింగ్, మే 13న కౌంటింగ్ జరగనుంది. కర్ణాటకలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషు ఓటర్ల సంఖ్య 2.6 కోట్లు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2.5 కోట్లు.
Read More: Teenmar mallanna : మేడ్చల్ `రెడ్డి` వార్ లో తీన్మార్ మల్లన్న