Site icon HashtagU Telugu

BJP New Team-2024 : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌

Bjp New Team 2024

Bjp New Team 2024

BJP New Team-2024 : 2024 లోక్ సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ  కొత్త టీమ్ ను రెడీ చేసింది. ఇందుకోసం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తన నూతన బృందాన్ని ఎంపిక చేశారు. మొత్తంగా 13 మందికి బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్‌ పదవులు, 9 మందికి బీజేపీ జనరల్ సెక్రటరీ పదవులు కేటాయించారు. ఉత్తర ప్రదేశ్ విధాన మండలి సభ్యులు తారిఖ్ మన్సూర్, కేరళకు చెందిన అబ్దుల్లా కుట్టిలను బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్‌ లుగా నియమించారు. జేపీ నడ్డా కొత్త టీమ్‌లో రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, మధ్యప్రదేశ్‌ బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ సహా మొత్తం 38 మంది నేతలకు చోటు దక్కింది. ఈ లిస్టులో విశేషమేమిటంటే.. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీకి కూడా పెద్దపీట వేశారు. ఆయనకు బీజేపీ జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చారు.

Also read : BRO Movie Collections: ‘బ్రో’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఈ నాయకులు..

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారిలో..  తెలంగాణ నుంచి DK అరుణ,  ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్‌, ఎంపీలు సరోజ్‌ పాండే (మధ్యప్రదేశ్), లతా ఉసెండీ (ఛత్తీస్ గఢ్), రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరా రాజే, జార్ఖండ్‌ నుంచి రఘువర్‌ దాస్‌, మధ్యప్రదేశ్‌ నుంచి సౌదన్‌ సింగ్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎంపీ లక్ష్మీకాంత్‌ బాజ్‌పాయ్‌, ఎంపీ రేఖా వర్మ, విధాన మండలి సభ్యులు తారిఖ్ మన్సూర్, ఒడిశా నుంచి బైజయంత్ పాండా, నాగాలాండ్ నుంచి M చౌబా అవో , కేరళ నుంచి అబ్దుల్లా కుట్టి ఉన్నారు.

 

Also read : CM Jagan: సిట్టింగ్స్ కు జగన్ షాక్.. పుత్రరత్నాలకు నో టికెట్స్?

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వీరే..  

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన వారిలో తెలంగాణ నుంచి ఎంపీ బండి సంజయ్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎంపీ అరుణ్‌సింగ్‌, ఎంపీ రాధామోహన్‌ అగర్వాల్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ఎంపీ కైలాష్‌ విజయవర్గీయ, ఢిల్లీ నుంచి దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌, రాజస్థాన్‌ నుంచి సునీల్‌ బన్సాల్‌, మహారాష్ట్ర నుంచి వినోద్‌ తావ్డే, పంజాబ్‌ నుంచి తరుణ్‌ చుగ్‌ ఉన్నారు. అదే సమయంలో బీజేపీ (ఆర్గనైజేషన్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్, జాతీయ ఆర్గనైజేషన్ సహ జనరల్ సెక్రటరీగా శివప్రకాష్ నియమితులయ్యారు.

Also read : T20 World Cup 2024: 2024 టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ ఇదేనా..? అమెరికా, వెస్టిండీస్‌లోని 10 నగరాల్లో మ్యాచ్‌లు..!

జాతీయ కార్యదర్శులు వీరే.. 

ఆంధ్ర ప్రదేశ్ నుంచి సత్య కుమార్, మహారాష్ట్ర నుంచి విజయ రహత్కర్, పంకజా ముండే, ఢిల్లీ నుంచి అరవింద్ మీనన్, పంజాబ్ నుంచి నరేంద్ర సింగ్ రైనా, రాజస్థాన్ నుంచి డాక్టర్ అల్కా గుర్జర్, పశ్చిమ బెంగాల్ నుంచి అనుపమ్ హజ్రా, మధ్యప్రదేశ్ నుంచి ఓంప్రకాష్ ధుర్వే, బీహార్ నుంచి రితురాజ్ సిన్హా, జార్ఖండ్‌ నుంచి ఆశా లక్రా, అస్సాం నుంచి ఎంపీ కామాఖ్య ప్రసాద్‌ టాసా, కేరళ నుంచి అనిల్‌ ఆంటోనీ జాతీయ కార్యదర్శులుగా నియమితులయ్యారు. కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేష్ అగర్వాల్‌ను పార్టీ  కోశాధికారిగా, ఉత్తరాఖండ్‌కు చెందిన నరేష్ బన్సాల్ ను సహ కోశాధికారిగా నియమించారు.  ఇక ఇప్పటివరకు పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్న దిలీప్ ఘోష్, భారతీబెన్ షాయల్, ప్రధాన కార్యదర్శులుగా ఉన్న సీటీ రవి, దిలీప్ సైకియా, కార్యదర్శిగా ఉన్న రహీష్ ద్వివేదీలకు కొత్త జట్టులో(BJP New Team-2024) చోటు దక్కలేదు.