లఖింపూర్లో బిజెపి ఎమ్మెల్యే యోగేష్ వర్మ (BJP MLA Yogesh Verma )కు ఛేదు అనుభవం ఎదురైంది. లఖింపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవధేష్ సింగ్ (local Bar Association President Awadhesh Singh) ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టారు. త్వరలో జరగనున్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికల విషయంలో మ్మెల్యే కు అవధేష్ సింగ్ కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు నామినేషన్ దాఖలు సందర్భంగా ఎమ్మెల్యే వస్తుండగా..ఎదురుగా వెళ్లిన అవదేశ్ సింగ్..పక్కన పోలీసులు ఉండగానే వర్మ చెంప పగలగొట్టాడు. ఈ ఘటన తో వర్మ షాక్ కు గురయ్యాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు సైతం ఎమ్మెల్యేపై దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Breaking: In UP Lakhimpur Kheri, BJP MLA Yogesh Verma was slapped amid a confrontation during the urban cooperative Bank elections. pic.twitter.com/b9fAyUJBMo
— Piyush Rai (@Benarasiyaa) October 9, 2024
Read Also : YS Jagan: మేము గుడ్ బుక్ రాసుకోవడం ప్రారంభించాం – వైఎస్ జగన్