Karnataka: ఈద్గా మైదాన్‌లో గణేష్‌ విగ్రహా ప్రతిష్ట

కర్ణాటక హుబ్బళ్లి నగరం ఈద్గా మైదాన్‌లో గణేష్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈద్గా మైదానంలో గణేష్‌ ఉత్సవాలకు అనుమతి నిరాకరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

Karnataka: కర్ణాటక హుబ్బళ్లి నగరం ఈద్గా మైదాన్‌లో గణేష్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈద్గా మైదానంలో గణేష్‌ ఉత్సవాలకు అనుమతి నిరాకరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం సిద్దరామయ్య ముస్లింలతో కలిసి నమాజ్‌ చేశాడు. కానీ, గణేష్ ఉత్సవాలకు అనుమతి కోరినప్పుడు అనుమతి నిరాకరించిందని తెలిపారు. నెల రోజుల క్రితం జిల్లా కమిషనర్‌కు లేఖ రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఈద్గా మైదాన్ నగర కార్పొరేషన్ ఆస్తి. ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా ఆ స్థలంలో గణేష్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని స్పష్టం చేశారు. ఈద్గా మైదాన్‌లో విగ్రహ ప్రతిష్ఠాపనకు గతేడాది సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈసారి కూడా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఇందుకు అనుమతి ఇచ్చింది అని తెలిపారు.

Also Read: Beauty Tips: అవాంచిత రోమాలతో ఇబ్బందిపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే?