BJP MLA Grandson Suicide: బీజేపీ ఎమ్మెల్యే మనవడు ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఖిల్చిపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హజారీలాల్ డాంగీ మనవడు విజయ్ డాంగి ఆత్మహత్య చేసుకున్నాడు. లా చదువుతున్న అతడు రెండు పేజీల సూసైడ్ నోట్‌ని పోలీసులు గుర్తించారు.

Published By: HashtagU Telugu Desk
BJP MLA Grandson Suicide

BJP MLA Grandson Suicide

BJP MLA Grandson Suicide: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఖిల్చిపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హజారీలాల్ డాంగీ మనవడు విజయ్ డాంగి ఆత్మహత్య చేసుకున్నాడు. లా చదువుతున్న అతడు రెండు పేజీల సూసైడ్ నోట్‌ని పోలీసులు గుర్తించారు. అందిన సమాచారం ప్రకారం 19 సంవత్సరాల వయస్సు ఉన్న విజయ్ డాంగి ఇండోర్‌లోని గాంధీనగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో లా చదువుతున్నాడు. సోమవారం అర్థరాత్రి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలం నుంచి రెండు పేజీల సూసైడ్ నోట్ కూడా పోలీసులకు లభించింది. అయితే పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అతడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

సంఘటనా స్థలం నుండి పోలీసులకు దొరికిన సూసైడ్ నోట్‌లో అతను తన తల్లిదండ్రులకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాడు. తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని తన సోదరుడికి విజ్ఞప్తి చేశాడు.తన స్నేహితుల గురించి కూడా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. సూసైడ్ నోట్‌లో ఆత్మహత్యకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనలేదు. దీంతో పోలీసులు కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నారు.

విజయ్‌కి ఇద్దరు సోదరులు ఉన్నారని సమాచారం. అన్నయ్య ఎంబీఏ చదువుతుండగా, తమ్ముడు విజయ్ ఈ ఏడాది లా చదవడానికి అడ్మిషన్ తీసుకున్నాడు. అతను నివసించే స్థలంలో అమ్మాయిలు కూడా పేయింగ్ గెస్ట్‌లుగా ఉన్నారు. విజయ్‌కి సంబంధించి, అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడని తెలుస్తుంది.

Also Read: Ebrahim Raisi Death: రైసీకి ఇండియా సంతాపం.. అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండా

  Last Updated: 21 May 2024, 02:19 PM IST