Bitcoin Record Price : డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర పైపైకి పోతోంది. ఇవాళ దాని ధర ఏకంగా 1 లక్ష డాలర్లు దాటేసింది. 1 లక్ష డాలర్లు అంటే భారతదేశ కరెన్సీలో దాదాపు రూ.84 లక్షలకు సమానం. ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున (నవంబరు 5న) బిట్‌కాయిన్ ధర కేవలం రూ.58 లక్షలే. దాని ధర గత నాలుగు వారాల వ్యవధిలో దాదాపు 45 శాతం పెరగడం గమనార్హం. కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే మాట్లాడుతూ.. ‘‘క్రిప్టో కరెన్సీకి సంబంధించిన నిబంధనలను సడలిస్తాను’’ అని ప్రకటించారు. దీంతో క్రిప్టో కరెన్సీ మార్కెట్ రెక్కలు తొడిగింది. ప్రత్యేకించి బిట్ కాయిన్ రేట్లు రివ్వుమని ఎగిశాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే బిట్ కాయిన్ ధర రూ.84 లక్షలు దాటేసింది.
Also Read :Andhra Odisha Border : ‘ఆంధ్రా-ఒడిశా బార్డర్’లో గుప్పుమంటున్న గంజాయి.. సంచలన నివేదిక
ఇవాళ ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ ఒక దశలో రూ. 1,00,512 రేటును టచ్ చేసింది. అపర కుబేరుడు, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్‌కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవిని కట్టబెట్టడం కూడా బిట్ కాయిన్(Bitcoin Record Price) ధర భారీగా పెరగడానికి ఒక కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎలాన్ మస్క్ బిట్ కాయిన్స్‌లో భారీగానే పెట్టుబడులు పెట్టారని చెబుతుంటారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత బిట్‌కాయిన్ ధర రూ.కోటి దాటే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఆ అంచనాలతోనే ఇప్పుడు బిట్ కాయిన్‌లో పెద్దఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
Also Read :Train General Coaches : గుడ్ న్యూస్.. ఇక ప్రతి రైలులో నాలుగు జనరల్ బోగీలు
అప్పుల ఊబిలో అమెరికా : ఎలాన్ మస్క్
ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ తరఫున ప్రచారం చేస్తూ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అమెరికా అప్పుల ఊబిలో ఉంది. ఆ అప్పులపై వడ్డీని కట్టేందుకు.. మన దేశానికి ఏటా వస్తున్న పన్ను ఆదాయంలో 23 శాతం భాగాన్ని కేటాయించాల్సి వస్తోంది. ప్రస్తుతం అమెరికా రక్షణ రంగ వార్షిక బడ్జెట్ 1 ట్రిలియన్ డాలర్లు. అంతే మొత్తాన్ని మనదేశం అప్పులపై వడ్డీలుగా కట్టాల్సి వస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే అమెరికా ఆర్థిక అత్యవసర పరిస్థితి నడుస్తోంది. ఇలాంటి పరిస్థితులు బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలు, బంగారం నిల్వలు అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టగలుగుతాయి’’ అని మస్క్ తెలిపారు.