BiggBoss: షణ్ముఖ్ కొంప ముంచిన ఓవర్ రొమాన్స్

ఏది బలంగా భావించి వెళ్లాడో.. అదే బలహీనతకు కారణమైంది. యస్.. బిగ్ బాస్ -5 కంటెస్టెంట్ షణ్ముఖ్ గురించి మాట్లాడితే ఇదే మాట వర్తిస్తుంది. అతని బలమే సోషల్ మీడియా..

  • Written By:
  • Updated On - December 19, 2021 / 09:36 PM IST

ఏది బలంగా భావించి వెళ్లాడో.. అదే బలహీనతకు కారణమైంది. యస్.. బిగ్ బాస్ -5 కంటెస్టెంట్ షణ్ముఖ్ గురించి మాట్లాడితే ఇదే మాట వర్తిస్తుంది. అతని బలమే సోషల్ మీడియా.. కానీ ఇప్పుడు ఆ మీడియా అతన్ని ఆ రేంజ్ లో సపోర్ట్ చేయలేదు. అందుకే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ అనే మాట స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. అందుకు కారణం అతని మితిమీరిన రొమాన్స్ తో పాటు కన్నింగ్ గేమ్ ప్లాన్స్ అంటున్నారు నెటిజన్స్. నిజానికి ఈ రాత్రికి అనౌన్స్ కాబోతోన్న విన్నర్ గురించి అప్పుడే అందరికీ తెలియకూడదు. కానీ గత వారం రోజులుగా విన్నర్ సన్నీనే అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అసలు ఈ సీజన్ మొదలైనప్పుడు సన్నీ ఇంత బలమైన కంటెస్టెంట్ అని ఎవరూ భావించలేదు. కానీ తనదైన గేమ్ ప్లాన్స్ తో ఆడుతూ ఆకట్టుకుంటూ రోజురోజుకూ తన బలం పెంచుకుంటూ వెళ్లాడు సన్ని.
ఒకవేళ చివరి మూమెంట్ లో షణ్ముఖ్ ను విన్నర్ గా ప్రకటించినా.. దాని ప్రభావం బిగ్ బాస్ పై మామూలుగా ఉండదు. విపరీతమైన నెగెటివిటీ మొదలవుతుంది. ప్రతిసారీ బిగ్ బాస్ హౌస్ లో ఒకటికి మించి రొమాంటిక్ కపుల్ కనిపించడం కామన్. ఈ సారి కూడా అదే జరిగింది. శ్రీరామ్ హమీదా, ఇష్టం ఉందో లేదో కానీ మానస్ – ప్రియాంక అలా కనిపించారు. హమీదా త్వరగానే నిష్క్రమించింది. ప్రియాంక తనకు తానుగా చాలా భావించుకుంది. అయితే షో ఆరంభం నుంచీ షణ్ముఖ్, సిరి మధ్య రొమాన్స్ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అవడం పెద్ద ఇబ్బందేం కాదు. కానీ ఈ ఇద్దరికీ ఆల్రెడీ లవర్స్ ఉన్నారు. ఆ విషయం సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. షణ్ముఖ్ అంతకు ముందు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన దీప్తి సునైన మధ్య ప్రేమ ఉంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు అని కూడా అందరికీ తెలుసు. ఇటు సిరి కూడా తన లవర్ తో యూ ట్యూబ్ లో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వస్తోంది. అలాంటి ఇద్దరూ అంత దగ్గరవడం.. పరిధికి మించి హగ్గులు, ముద్దులు పెట్టుకోవడం చాలామందికి నచ్చలేదు. ముఖ్యంగా షణ్ముఖ్ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. అందుకే అతని గ్రాఫ్ పడిపోయిందనేది ఒక వాదనం. ఆ కారణంగానే షణ్ముఖ్ విన్నర్ కావాల్సినవాడు కాస్తా రన్నరప్ మిగిలిపోతున్నాడు అంటున్నారు. ఏదేమైనా ఓ జంట ప్రేమలో పడితే కామన్. కానీ ఆల్రెడీ వేర్వేరు మనుషులతో ప్రేమలో ఉన్నవారు.. దొరికిన ప్రైవసీని ఇలా రొమాన్స్ చేస్తూ వాడుకోవడం వారి అభిమానులకు నచ్చలేదేమో..