BIG Breaking in AP : చంద్రబాబు ను అరెస్ట్ చేసి తన కోరిక తీర్చుకున్న జగన్

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ను అరెస్ట్ చేసారు.

  • Written By:
  • Updated On - September 9, 2023 / 07:49 AM IST

BIG Breaking Chandrababu Naidu Arrest :

ఏపీ పోలీసులు అనుకున్నది సాధించారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (skill development case) కేసుల్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నంద్యాలలో చంద్రబాబు (Chandrababu ) బస చేసిన ఉన్న RKఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్న పోలీసులు అరెస్టు చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా చాలా హైడ్రామా నడిచింది. చంద్రబాబు బస చేస్తున్న ప్రాంగణానికి జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల మొహరించారు. చంద్రబాబు ను అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. చంద్రబాబు సైతం అరెస్ట్ ను ఒప్పుకున్నారు.

Read Also: Lokesh: పిచ్చోడు లండన్ కి.. మంచోడు జైలుకి అని లోకేష్ ట్వీట్.. చంద్రబాబు వద్దకు వెళ్తున్న లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు..!

పోలీసుల ఇచ్చిన FIR కాపీని న్యాయవాదులు, చంద్రబాబు పరిశీలించారు. కొన్ని గంటల్లో పూర్తి వివరాలు ఇస్తామని పోలీసులు తెలిపారు. FIR‍లో చంద్రబాబు పేరు లేదని న్యాయవాదులు ప్రశ్నించారు. FIRలో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? అని నిలదీశారు. అరెస్టుకు ముందు ఆ పత్రాలు ఇవ్వాలని చంద్రబాబు ఆర్గ్యూ చేశారు. పౌరుడిగా తన హక్కని అన్నారు. అరెస్టు చేసిన తర్వాత తగిన పత్రాలు ఇస్తామన్నారు పోలీసులు.

ప్రస్తుతం మాత్రం చంద్రబాబు విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. 2015లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌- సీమెన్స్‌ ప్రాజెక్టు వెలుగులోకి వచ్చింది సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థలతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 3,356 కోట్ల రూపాయలు. కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం ఉంది. 371 కోట్ల రూపాయలు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చి నేపథ్యంలో.. వైపీసీ నేతృత్వంలోని ప్రభుత్వం 2020 ఆగస్టులో విచారణకు ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ జరిగింది. 2020 డిసెంబరు 10న విజిలెన్స్‌ విచారణ చేపట్టారు. 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణ ప్రారంభించింది. 2021 డిసెంబర్‌ 9న ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు.

Read Also: AP Bandh : రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చే ఆలోచనలో టీడీపీ..

ఇలా దీనిపై పోలీసులు చంద్రబాబు ను అరెస్ట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. అర్ధరాత్రి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు చంద్రబాబు బస చేసిన RK ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు చంద్రబాబు ను అరెస్ట్ చేస్తారనే సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నంద్యాల కు చేరుకున్నారు. దాదాపు మూడు గంటలుగా పోలీసులు RK ఫంక్షన్ హాల్ వద్ద వేచియున్నారు. కొద్దీ సేపటి క్రితం చంద్రబాబు కు మెడికల్ టెస్ట్ చేసేందుకు వైద్య బృందం చంద్రబాబు నిద్ర పోతున్న బస్ కాన్వాయ్ వద్దకు చేరుకున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు బస్సు నుండి బయటకు వచ్చారు. డీఐజీ రఘురామరెడ్డి తో మాట్లాడుతున్నారు. అసలు ఏంజరుగుతుందో..? ఎందుకు వచ్చారు..? ఎందుకు అరెస్ట్ చేస్తారు..? మీ దగ్గర నన్ను అరెస్ట్ చేసేందుకు ఏ ఆధారాలు ఉన్నాయి..? ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు..? ఏ నేరంలో ..తన వద్దకు వచ్చారు ..? మీరు అర్ధరాత్రి ఎందుకు రావాల్సి వచ్చింది..? నేను ఎక్కడికి పారిపోతున్నాను..? ఎఫైర్ లో నా పేరు లేదు..అయినప్పటికీ ఎందుకు అరెస్ట్ చేస్తారు..? అరెస్ట్ చేయడానికి ఏ ఆధారాలు ఉన్నాయి. అని చంద్రబాబు అడుగుతున్నారు. చంద్రబాబు ప్రశ్నలకు రఘురామరెడ్డి సమాదానాలు చెపుతున్నారు.

Read Also: CBN Arrest – A Conspiracy : విజయవాడకు చంద్రబాబు తరలింపు.. ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో ముందుగానే హెలికాప్టర్ ?

మరోపక్క చంద్రబాబు ఉండే ప్రాంతంలో ఎవర్నీ ఉంచడం లేదు. భూమా అఖిల ప్రియసహా ఇతర నాయకులను బయటకు పంపించేశారు. బలవంతంగా వారిని లాగిపడేస్తున్నారు. పోలీసులు చంద్రబాబు ను అరెస్ట్ చేసిన మా పోరాటం ఆగదు..ఈ సైకో ప్రభుత్వం దిగకమానదు అని టీడీపీ శ్రేణులు అంటున్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నంద్యాలకు వస్తుండడం తో..ఎక్కడిక్కడే పోలీసులు వారిని అడ్డుకుంటూ అరెస్ట్ లు చేస్తున్నారు.

పోలీసులు చంద్రబాబు ను అరెస్ట్ చేసిన మా పోరాటం ఆగదు..ఈ సైకో ప్రభుత్వం దిగకమానదు అని టీడీపీ శ్రేణులు అంటున్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నంద్యాలకు వస్తుండడం తో..ఎక్కడిక్కడే పోలీసులు వారిని అడ్డుకుంటూ అరెస్ట్ లు చేస్తున్నారు.

Read Also: Chandrababu Case: చంద్రబాబు అరెస్ట్.. అసలు కేసు ఏంటి..?

ప్రస్తుతం చంద్రబాబు కు డాక్టర్స్ మెడికల్ టెస్ట్ చేయబోతున్నారు. చంద్రబాబు బస్ వద్దకు వైద్య బృందం చేసుకున్నారు. చంద్రబాబు కు మెడికల్ టెస్ట్ చేసి..ఆ రిపోర్ట్ ను NSG కి పంపాలని చూస్తున్నారు. అలాగే చంద్రబాబు కాన్వాయ్ తోనే లాక్కెళ్లేందుకు పోలీసులు సిద్ధం చేసారు. జేసీబీ లతో ప్రాంగణం లో ఉన్న వాహనాలను పక్కకు తొలగిస్తున్నారు. టీడీపీ నేతలను , కార్యకర్తలను అక్కడి నుండి బయటకు పంపిస్తున్నారు. మరోపక్క చంద్రబాబు ను అరెస్ట్ చేస్తే రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వాలని టీడీపీ శ్రేణులు చూస్తున్నారు. దీనిని గమనించిన పోలీసులు ముందే ఎక్కడిక్కడే టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయాలనీ భావిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ వాతారణం నెలకొంది.

ఓ పక్క ఢిల్లీ లో ఈరోజు నుండి G20 సదస్సు జరగబోతుంది. ఈ సదస్సు కు అగ్ర దేశాల అధినేతలు హాజరయ్యారు. దేశం యొక్క ప్రాముఖ్యత..అభివృద్ధి..కొత్త ప్రాజెక్ట్ లు , రాష్ట్రాల తీరు ఇవన్నీ చెప్పేందుకు కేంద్రం చూస్తుండగా..ఇప్పుడు చంద్రబాబు ను అరెస్ట్ చేయడం అనేది ఏపీ పరువు తీయడమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 14 ఏళ్ల పాటు సీఎం గా ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితుడైన చంద్రబాబు ను అరెస్ట్ చేశారనే వార్త అందర్నీ కలిచి వేస్తుంది. ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు యావత్ ప్రజలు ఛీ కొడుతున్నారు.

 

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు( Chandrababu Naidu) సీఎం గా ఉన్న సమయంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల రూపంలో రూ.118 కోట్ల ముడుపులు అందుకున్నారని ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఆదాయ పన్ను శాఖ షోకాజ్(Show Cause notice) నోటీసులు ఇవ్వడం జరిగింది. వీటిపై చంద్రబాబు తెలిపిన అభ్యంతరాలను ఐటీ శాఖ(IT) తిరస్కరించింది. మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో చంద్రబాబు ముడుపుల విషయం బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి) ఒప్పుకున్నారు. గత ఐదు రోజులుగా ఈ నోటీసుల నేపథ్యంలో పోలీసులు చంద్రబాబు ను అరెస్ట్ చేస్తారనే వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి. రెండు రోజుల క్రితం కూడా చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారని చెప్పడం తో టీడీపీ శ్రేణులు మరింత ఆందోళనకు గురయ్యారు. అంత అనుకున్నట్లే నంద్యాలలో ఉన్న చంద్రబాబు ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేరుకున్నారు.

Read Also : AP : శుక్రవారమే చంద్రబాబు ను అరెస్ట్ చేయాలనుకోవడం వెనుక జగన్ భారీ మాస్టర్ ప్లాన్

ఐటీ నోటీసుల కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే ఐటీ శాఖ నుంచి షోకాజ్‌ నోటీసు మాత్రమే వచ్చినందున అరెస్ట్‌ చేసే అవకాశం లేదని, అన్నమయ్య జిల్లా అంగళ్లు దాడి ఘటనలో ఆయన్ను అరెస్ట్‌ చేస్తారని స్పష్టత వచ్చింది. దీనిపై పోలీసు అధికారులు ఎవరూ అధికారికంగా స్పందించకున్నప్పటికీ చంద్రబాబు ను అదుపులోకి తీసుకోవడం అనేది జగన్‌ సర్కార్ తీరు కుట్రపూరితంగా ఉంది.

అంగళ్లు ఘటనలో చంద్రబాబు ఏ1గా ఉండటం, ఆయనపై హత్యాయత్నం కేసు (307) సహా తీవ్ర అభియోగాలు నమోదైన నేపథ్యంలో అరెస్ట్ చేయడానికి ప్రాధాన్యం ఏర్పడింది. శుక్రవారమే చంద్రబాబు ను అరెస్ట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఎందుకంటే శని, ఆదివారాలు కోర్టుకు సెలవు. కేసులో మోపిన అభియోగాల తీవ్రత దృష్ట్యా మేజిస్ట్రేట్‌ ఇంటి వద్ద చంద్రబాబును హాజరు పరిచినా అప్పటికప్పుడు ఎంత వరకు రిలీఫ్‌ లభిస్తుందనేది సందేహమే. మేజిస్ట్రేట్‌ నుంచి చంద్రబాబుకు ఊరట లభించకుంటే శని, ఆదివారాలు జైలులో ఉంచాలన్నది జగన్‌ సర్కారు ఉద్దేశమని చెబుతున్నారు.

Read Also : AP : చంద్రబాబును అరెస్ట్ చేస్తే రాష్ట్రం అల్లకల్లోలమే అంటున్న టీడీపీ శ్రేణులు..

చంద్రబాబు బస చేసిన RK ఫంక్షన్ హల్ ప్రాంగణానికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ ను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. 3 గంటల సమయంలో రావాల్సిన అవసరం ఏంటి అని నేతలు ప్రశ్నిస్తున్నారు . DIG రఘురాం ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల మంది పోలీసులు చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్‌ చుట్టుముట్టారు. ఫంక్షన్ హల్ చుట్టూ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. అర్థరాత్రి రావడంపై పోలీసులను టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ వార్త తెలుసుకున్న టీడీపీ నేతలు , శ్రేణులు వందలాది సంఖ్యలో నంద్యాలకు చేరుకుంటున్నారు. ఒక్క పోలీస్ ను కూడా బయటకు వెళ్లకుండా టీడీపీ శ్రేణులు RK ఫంక్షన్ హల్ చుట్టూ నిల్చున్నారు. చంద్రబాబు ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అల్లకొల్లలం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

Read Also : Juices: మీ స్కిన్ అందంగా మెరిసిపోవాలంటే ఈ జ్యూసులు తాగాల్సిందే?

తాము చేస్తున్న పనికి అడ్డుపడొద్దని టీడీపీ లీడర్లకు వార్నింగ్ ఇస్తున్న పోలీసులు. అర్థరాత్రి వచ్చి అడ్డుపడొద్దని బెదిరించడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇరు వర్గాల మధ్య డిస్కషన్ నడుస్తోంది. విదేశాలకు వెళ్లిపోతారనే అనుమానంతో వచ్చామని టీడీపీ నేతలకు తెలిపిన పోలీసులు. ఈకేసులో ఇప్పటికే ఇద్దరు విదేశాలకు వెళ్లిపోయారు.. మీరు ఎక్కడికీ వెళ్లొద్దని విచారణకు సహకరించాలని చెప్పడానికే చంద్రబాబు వద్దకు వచ్చామని పోలీసులు చెపుతున్నారు.

Also Read:  IT Notice to Chandrababu : చంద్రబాబు చంద్రమడలం వెళ్లిన అరెస్ట్ తప్పదు – గుడివాడ అమర్నాథ్