Actress Arrested: సెక్స్ రాకెట్ కేసులో మరో నటి అరెస్ట్

వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై భోజ్‌పురి నటి (Bhojpuri Actress)ని ముంబై పోలీసులు అరెస్ట్ (Arrested) చేశారు. భోజ్‌పురి నటి సుమన్ కుమారి చాలా మంది అమ్మాయిలను మోడల్‌లుగా మార్చే పేరుతో వ్యభిచారంలోకి దింపుతోంది.

  • Written By:
  • Publish Date - April 22, 2023 / 11:29 AM IST

వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై భోజ్‌పురి నటి (Bhojpuri Actress)ని ముంబై పోలీసులు అరెస్ట్ (Arrested) చేశారు. భోజ్‌పురి నటి సుమన్ కుమారి చాలా మంది అమ్మాయిలను మోడల్‌లుగా మార్చే పేరుతో వ్యభిచారంలోకి దింపుతోంది. ఇటీవల సెక్స్ రాకెట్ నడుపుతున్నందుకు ఒక నటి, కాస్టింగ్ డైరెక్టర్ అరెస్టయ్యారు. ఇప్పుడు సెక్స్ రాకెట్ నడుపుతున్న మరో నటి అరెస్ట్ అయింది.

ముంబై పోలీసులు హై ప్రొఫైల్ వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో సోదాల అనంతరం ఒక భోజ్‌పురి నటిని కూడా అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమన్ కుమారి అనే ఈ భోజ్‌పురి నటి హై ప్రొఫైల్ వ్యభిచారంలో మధ్యవర్తిగా పనిచేస్తోంది. ఈ కేసులో వ్యభిచార కూపం నుంచి ముగ్గురు యువతులను పోలీసులు రక్షించినా.. ప్రస్తుతం ఈ విషయమై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Rahul Gandhi: ప్రభుత్వ నివాసాన్ని పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ.. నేడు అధికారులకు బంగ్లాను అప్పగించనున్న రాహుల్..!

వ్యభిచారంపై అధికారులకు రహస్య సమాచారం అందినట్లు సమాచారం. ఆ తర్వాత ముంబై పోలీసుల సోషల్ క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఆరే కాలనీలోని రాయల్‌ పామ్‌ హోటల్‌లో ఈ అక్రమ దందా సాగుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ అక్రమాన్ని బట్టబయలు చేసేందుకు పోలీసులు పూర్తి ప్రణాళిక సిద్ధం చేశారు. పోలీసులు సుమన్ కుమారి వద్దకు నకిలీ కస్టమర్‌ను పంపగా ఆ నకిలీ కస్టమర్‌తో సుమన్ కుమారి డీల్ చేసింది. ఈ డీల్ లో ఆమె ఒక్కో మోడల్‌కు 50 నుండి 80 వేల రూపాయలు డిమాండ్ చేసింది.

సుమన్‌ కుమారి చాలా సినిమాల్లో కనిపించింది. ‘లైలా మజ్ను’, ‘బాప్ నంబ్రి, బేటా దస్ నంబ్రి’ వంటి అనేక భోజ్‌పురి చిత్రాలలోపనిచేసింది. నటిగానే కాకుండా సుమన్ గాయని కూడా. ఆమె హిందీ, పంజాబీ, భోజ్‌పురితో సహా అనేక భాషలలో పాటలు కూడా పాడింది. ఇది కాకుండా సుమన్ కుమారి బూమ్ OTT ఛానెల్‌లో కూడా పనిచేసింది. ఇటీవల బాలీవుడ్ నటి ఆర్తీ మిట్టల్ సెక్స్ రాకెట్ నడుపుతున్నందుకు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.