Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం ఇంట్లో విషాదం

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు (Mallu Venkateswarlu) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రి(AIG Hospital)లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు మల్లు వెంకటేశ్వర్లు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. దీంతో భట్టి వైరాకు బయల్దేరారు. We’re now on WhatsApp. Click to Join. మల్లు వెంకటేశ్వర్లు హోమియో ఎండి చదివారు. అంతేకాకుండా.. ఆయుష్ […]

Published By: HashtagU Telugu Desk
Mallu Venkateswarlu

Mallu Venkateswarlu

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు (Mallu Venkateswarlu) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రి(AIG Hospital)లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు మల్లు వెంకటేశ్వర్లు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. దీంతో భట్టి వైరాకు బయల్దేరారు.

We’re now on WhatsApp. Click to Join.

మల్లు వెంకటేశ్వర్లు హోమియో ఎండి చదివారు. అంతేకాకుండా.. ఆయుష్ శాఖలో ప్రొఫెసర్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. మల్లు వెంకటేశ్వర్లకు హోమియో వైద్యంలో ఎంతో మంచి పేరు ఉండటంతో.. వైరాలోని 1వ వార్డులో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను ఏర్పాటు చేసి సేవలందించారు. ఆయన వద్ద వైద్యం చేయించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. అయితే గత మూడు నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో మల్లు వెంకటేశ్వర్లు బాధపడుతుండటంతో ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయనను చేర్పించి చికిత్స అందిస్తున్నారను. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతున్న వెంకటేశ్వర్లు గత మూడు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు.

Read Also : Delhi Chalo : కేంద్రంతో చర్చలు విఫలం.. ‘చలో ఢిల్లీ’కి బయలుదేరిన రైతులు

దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి  మంగళవారం ఉదయం 6 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. డబ్బు కోసం కాకుండా సామాజిక బాధ్యతతో ఈ ఆసుపత్రిని ఆయన నిర్వహించారు. తన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు మల్లు వెంకటేశ్వర్లు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నందిని దంపతులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మల్లు కుటుంబీకులు హాజరుకానున్నారు.

 

  Last Updated: 13 Feb 2024, 09:58 AM IST