Viral News : బెంగళూరులోని ఐఐఎంలో ఒక చిన్న కాఫీ షాప్ నిర్వహిస్తున్న ప్రభాకర్, తన జీవితంలో ఊహించని సంఘటనను ఎదుర్కొన్నాడు. ఒక సాధారణ రోజు, అతను తన భార్య సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా చెక్ చేస్తూ చూసిన విషయం అతని జీవితాన్ని ఒక్కసారిగా కల్లోలం చేయించింది. రూ.999 కోట్ల డిపాజిట్ జరిగినట్టు చూడటం అతనికి కలుగులోకి అడుగుపెట్టినట్లే అనిపించింది. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖాతాలో ఉండడాన్ని అతను మొదట అర్థం చేసుకోలేకపోయాడు. ఆ ఆశ్చర్యకరమైన ఘట్టం వెంటనే అతని జీవితంలో సమస్యలకూ కారణమైంది. బ్యాంక్ అధికారులు తక్షణమే ఆ ఖాతాను ఫ్రీజ్ చేసి, సదరు నగదును 48 గంటలలోపే తిరిగి తీసుకున్నారు. ఇది ప్రభాకర్ , అతని కుటుంబానికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను తెచ్చింది. ఆ ఖాతా ఫ్రీజ్ చేయడంతో, వారి సొంత డబ్బును కూడా వాడుకోలేకపోయారు. రోజువారి ఖర్చులు, వ్యాపార అవసరాలు నెరవేర్చడానికి ఆ డబ్బు వినియోగించాల్సిన పరిస్థితిలో, ఖాతా నిలిచిపోవడం వారి జీవితాన్ని దెబ్బతీసింది.
Tehsildars Transfers: తహశీల్దార్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
ప్రభాకర్ ఈ ఘటనపై మాట్లాడుతూ, తనకు బ్యాంక్ నుంచి ఎలాంటి సహాయం లభించకపోవడం చాలా నిరాశ కలిగించిందని చెప్పాడు. “నా ఖాతాలో రూ. 999 కోట్ల డిపాజిట్ కాగానే, వారు నా అకౌంట్ ఫ్రీజ్ చేశారు. ఇప్పటివరకు నా ఖాతా యాక్టివ్ చేయడం లేదు, వారు ఎప్పుడైతే నా ఖాతా మళ్లీ యాక్టివ్ చేస్తారో కూడా చెప్పడం లేదు” అని అతను వాపోయాడు. ప్రభాకర్ చెప్పిన వివరాల ప్రకారం, బ్యాంక్ అధికారులు ఆయనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. బ్యాంక్ నుంచి ఎలాంటి వివరణ లేకుండా, ఆయన ఖాతా ఫ్రీజ్ చేయడం వల్ల, ఆయనకు రోజువారి వ్యాపార లావాదేవీలు కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. తన కాఫీ షాప్ నిర్వహణలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో, ఆయన వ్యాపారం దెబ్బతింది. “వాళ్లతో మాట్లాడి, ఏమైనా సమస్య ఉంటే మీమీరే సరిచేయండి, కానీ నా ఖాతాలో ఉన్న మొత్తాన్ని విడుదల చేయండి అని చెప్పాను. కానీ, వారు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు” అని ప్రభాకర్ తెలిపాడు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభాకర్
అతని కుమారుడు సెంట్రల్ బ్యాంక్ అధికారులకు అనేక మెయిల్స్ పంపినా, ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదని, బ్యాంకు అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. “వారు ఇప్పటికీ మా మెయిల్స్ కు సమాధానం ఇవ్వలేదు. మా అకౌంట్ ఎప్పుడు తిరిగి యాక్టివ్ అవుతుందో కూడా చెప్పట్లేదు” అని ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఆర్థిక నిపుణులు స్పందిస్తూ, ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పొరపాటున ఖాతాలో జమ అయినట్లు కనిపిస్తోందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. “ఇంత భారీ మొత్తం పడ్డప్పుడు, అది తప్పిదం కావచ్చని, బ్యాంక్ లోపం వల్ల జరిగే సమస్య అని అనిపిస్తుంది. ప్రభాకర్ బ్యాంకు సత్వరమే స్పందించకపోతే, ఈ సమస్యను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దృష్టికి తీసుకెళ్లడం మంచిదని సూచిస్తున్నాము” అని MyWealthGrowth.com సహ వ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా చెప్పారు. ప్రభాకర్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. వారి అసలు బ్యాలెన్స్ ఖాతాలో కనిపిస్తున్నా, దానిని వాడుకునే అవకాశముండకపోవడం వారి జీవితంలో తీవ్రమైన ఇబ్బందులను తెచ్చింది.