Aindrila Sharma: బెంగాలీ నటి ఐంద్రిలా శర్మ మృతి.!

బెంగాలీ నటి ఐంద్రిలా శర్మ మృతి చెందారు.

  • Written By:
  • Publish Date - November 20, 2022 / 02:52 PM IST

బెంగాలీ నటి ఐంద్రిలా శర్మ మృతి చెందారు. కోల్‌కత్తాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఆమె కన్నుమూశారు. 24 ఏళ్ల ఐంద్రిలాకు ఇటీవల తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. కొన్ని రోజులుగా వెంటిలేటర్‌ సపోర్టుతో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఐంద్రిలా మరణించిన విషయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌ చౌదరి సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.

బెంగాలీ సినీ నటి ఐంద్రిలా శర్మ ఆదివారం మధ్యాహ్నం 12:59 గంటలకు తుది శ్వాస విడిచారు. 24 ఏళ్ల ఐంద్రిలాకు ఇటీవల తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. కొన్ని రోజులుగా వెంటిలేటర్‌ సపోర్టుతో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. నవంబర్ 1న ఆమె తీవ్ర అస్వస్థతకు గురై హౌరాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఐంద్రిలా మెదడులో రక్తస్రావం అయినట్లు వైద్యులు తెలిపారు. ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె తిరిగి స్పృహలోకి రాలేదు. ఆదివారం ఆసుపత్రిలో మరణించింది. గత నవంబర్ 14 నుంచి ఐంద్రిలా ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. శనివారం (నవంబర్ 19) రాత్రి తీవ్రమైన గుండె నొప్పి వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు.

గతంలో రెండుసార్లు క్యాన్సర్‌తో బాధపడిన ఐంద్రిలా కోలుకుంది . 2015లో 11వ తరగతి చదువుతుండగా తొలిసారి క్యాన్సర్‌ బారిన పడింది. క్యాన్సర్ ఆమె ఎముక మజ్జపై దాడి చేసింది. 2021లో రెండోసారి ఊపిరితిత్తుల్లో కణితి ఏర్పడింది. క్యాన్సర్‌తో పోరాడడంతో పాటు తన నటనను కొనసాగింది. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా నటి నవంబర్ 1న ఆసుపత్రిలో చేరారు. ఐంద్రిలా ఆదివారం మరణించిన విషయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌ చౌదరి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఐంద్రిలా.. ఝుముర్ సీరియల్ ద్వారా టీవీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తర్వాత జీవన్ జ్యోతి, జీవన్ క్రాంతి లాంటి షోలతో పాపులర్ అయ్యారు. ఆమె కొన్ని ఓటీటీ ప్రాజెక్టుల్లో కూడా పనిచేశారు.