Site icon HashtagU Telugu

Weather Alert : పండగ వేళ.. తెలుగు రాష్ట్రాలకు వర్షాలకు భారీ వర్ష సూచన

Rain Alert

Rain Alert

Weather Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అనేక జిల్లాలు వరుస వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం వరుణుడి బారి నుంచి తప్పించుకోలేకపోతోంది. నగరంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాంతం భారీ వర్షాల ప్రభావానికి గురవుతోంది. తాజాగా ఈ ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం వల్ల, రాబోయే రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, నారాయణపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, గద్వాల తదితర జిల్లాలకు ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.

Maa Nanna Super Hero Review & Rating : మా నాన్న సూపర్ హీరో రివ్యూ & రేటింగ్

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రెండు రోజుల పాటు ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఏపీలోనూ కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా కోస్తా ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెలలోనే అరేబియా సముద్రంలో ఒక తుపాను, బంగాళాఖాతంలో రెండు తుపానులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కోస్తా జిల్లాల్లో ఈ తుపానుల ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా ఉంది.

ఇదిలా ఉండగా, ప్రతి సంవత్సరం అక్టోబరులో తుపానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర ప్రభావం చూపడం సర్వసాధారణం. గతంలో ఈ నెలలో వచ్చిన పలు తుపానులు భారీ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. పైలిన్, హుద్‌హుద్, అంపన్ వంటి తుపానులు ఏ పేరుతోనైనా, ఎక్కడ తీరం దాటినా రాష్ట్రానికి భారీ నష్టం కలిగించాయి. ఈ అనుభవాల నేపథ్యంలో అక్టోబర్ నెల పేరును విన్నారంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నులో వణుకు పుడుతుంది. తుపాను ప్రభావం సమయంలో ఉరుములు, మెరుపులు, గాలివానలు ప్రబలినప్పుడు ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. చిన్నపాటి గాలివాన వల్ల కూడా రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు, పంట నష్టపోయే ప్రమాదం ఉండటంతో వారు చాలా బాధపడుతున్నారు.

అందువల్ల, రాష్ట్ర ప్రజలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు ముందుగానే సిద్ధంగా ఉండి, ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటించాలని, ఆపద సమయంలో సహాయ చర్యలకు సంబంధిత యంత్రాంగాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Maa Nanna Super Hero Review & Rating : మా నాన్న సూపర్ హీరో రివ్యూ & రేటింగ్