Sara Tendulkar: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటారు. సారా టెండూల్కర్ వీడియోలు, చిత్రాలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. సారా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సారా డ్రెస్సింగ్ స్టైల్, ఆమె అందం హీరోయిన్స్ కంటే తక్కువ కాదు. ప్రస్తుతం సారా విహారయాత్రల్లో బిజీగా ఉన్నారు. సారా సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన వీడియో, చిత్రాలను కూడా షేర్ చేసింది. అయితే ఈ విహారయాత్రలో సారా తృటిలో ప్రమాదం నుంచి బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి.
#SaraTendulkar 🤩💥 pic.twitter.com/tIkOj8ob7E
— Star Gallery (@stargallery2020) September 10, 2024
తేనెటీగల దాడి
నిజానికి సారా టెండూల్కర్ తన మొబైల్ కెమెరాలో పిక్నిక్ సమయంలో క్షణాన్ని బంధిస్తోంది. ఈ సమయంలో ఒక తేనెటీగ సారా దగ్గరకు వచ్చింది. దాని కారణంగా సారా కొద్దిగా భయపడినట్లు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే తేనెటీగ సారాపై దాడి చేయలేకపోయింది. ఈ ఘటన కెమెరాలో కూడా రికార్డయింది. సారా టెండూల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులతో పంచుకున్నారు. సారా టెండూల్కర్ లండన్‌లో విహారయాత్ర చేస్తోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా లైవ్ కాన్సర్ట్ వీడియోను కూడా పంచుకున్నారు.
Also Read: Alcohol Side Effects: ప్రతిరోజూ మద్యం తాగే అలవాటు ఉందా..? అయితే ఈ విషయాలు తెలుసా..?
గిల్‌తో ప్రేమలో ఉన్నట్లు కథనాలు
సారా టెండూల్కర్, టీం ఇండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ మధ్య సంబంధం గురించి పుకార్లు తరచుగా సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత వీరిద్దరి గురించి చాలా చర్చ జరిగింది. అయితే ఈ విషయమై ఇద్దరి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. అయితే సోషల్ మీడియా యూజర్లు మాత్రం ఇద్దరి ఫొటోలు పేట్టి పోస్టులు షేర్ చేస్తూనే ఉన్నారు. టీమ్ ఇండియా మ్యాచ్‌ల సమయంలో సారా టెండూల్కర్ స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూడటం చాలాసార్లు కనిపించింది.