Site icon HashtagU Telugu

AP : హిందూ సంప్రదాయంపై అవగాహనలేని వ్యక్తిని టీటీడీ ఛైర్మన్ గా ఎలా చేస్తారు..? – బండి సంజయ్

Bandisnjay Ttd

Bandisnjay Ttd

మొన్నటి వరకు కేసీఆర్ (CM KCR) ఫై నిప్పులు చెరుగుతూ వచ్చిన బండి సంజయ్..ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) ఫై పడ్డారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay) ని బిజెపి అధిష్టానం జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఎంపిక చేసారు. ఈ క్రమంలో బండి సంజయ్ అన్ని రాష్ట్రాల ఫై ఫోకస్ చేయనున్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల ఫై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంజయ్ ..అధికార పార్టీ బిఆర్ఎస్ ఫై పలు విమర్శలు చేయగా ..ఇక ఇప్పుడు ఏపీ ఫై పడ్డారు.

సోమవారం విజయవాడలో పర్యటించిన బండి సంజయ్.. జగన్ సర్కారుపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. ఈరోజు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chairman Bhumana Karunakar Reddy)పై విమర్శలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అసలు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎవరని బండి సంజయ్ ప్రశ్నించారు. భూమన కూతురి వివాహం ఏ మత సంప్రదాయంలో చేసారని, ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఏ మతానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారని నిలదీశారు. సనాతన ధర్మం, హిందూ సంప్రదాయంపై ఎలాంటి అవగాహనలేని వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టి.. హిందూ ప్రజలను తీవ్రంగా అవమానిస్తున్నారని విమర్శించారు. హిందూ సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వటాన్ని.. తెలుగు రాష్ట్రాల హిందూ సమాజంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులంతా గమనించాలని.. ప్రతీ ఒక్కరూ స్పందించాలని బండి సంజయ్ కోరారు. భూమనకు తిరుమలపై అడవులున్న విషయం తెలియదటా అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆయనకు అల్లు అర్జున్ నటించిన పుష్ప (Pushpa Movie) సినిమా చూపించాలని సెటైర్ వేశారు. సినిమా చూపిస్తేనైనా.. ఇక్కడ అడవులున్న విషయం అర్థమవుతుందేమోనని వ్యాఖ్యానించారు.

Read Also : Chandrayaan-3 : ప్రభుత్వ పాఠశాలల్లో చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్షప్రసారం