IPL : ఐపీఎల్ కామెంటేటర్‎గా బాలకృష్ణ, క్రికెట్ ఫ్యాన్స్‎కు పండగే

సినీహీరోగా, రాజకీయ నాయకుడిగా బాలకృష్ణకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. బాలయ్య బాబు మూవీ రిలీజ్ అయితుందటే ఫ్యాన్స్ గోల మామూలుగా ఉండదు.

  • Written By:
  • Publish Date - March 26, 2023 / 01:55 PM IST

సినీహీరోగా, రాజకీయ నాయకుడిగా బాలకృష్ణకు(Balakrishna) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. బాలయ్య బాబు మూవీ రిలీజ్ అయితుందటే ఫ్యాన్స్ గోల మామూలుగా ఉండదు. బాలయ్య బాబు కూడా ఆ రేంజ్ లో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తాడు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు టాక్ షోలోకు హోస్టుగా వ్యవహారిస్తూ తన సత్తాచాటాడు. ప్రేక్షకులతో భేష్ బాలయ్య అనిపించుకున్నారు. వెండితెర, బుల్లితెర అభిమానులనే కాదు ఇప్పుడు క్రికెట్ అభిమానులను కూడా ఖుషీ చేసేందుకు కామెంటేటర్ అవతరామెత్తబోతున్నాడు. అవును ఈ విషయం స్వయంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు వెల్లడించింది.

మార్చి 31న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో(IPL) బాలకృష్ణ కామెంటరీతో సందడి చేయనున్నారు. ఐపీఎల్ ఓపెనింగ్ రోజున బాలయ్య కామెంటరీ ఉంటుందని స్టార్ స్పోర్ట్స్ తెలిపింది. దీనికి సంబంధించి ట్విట్ చేయడంతో ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. బాలకృష్ణ ఎలా కామెంట్ చేస్తాడో చూసేందుకు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు.