Telugu Go : తెలుగులో జీవో విడుదల చేసి తన మార్క్ చూపించిన బాబు

Telugu Go : ప్రతి జీవోను ఇంగ్లిష్ తో పాటు తెలుగు భాషలో కూడా విడుదల చేయాలని నిర్ణయించింది

Published By: HashtagU Telugu Desk
CM Chandrababu Warning

CM Chandrababu Warning

దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’ అన్న వైనంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం, ఇంగ్లిషు మీడియం పాఠశాలలపై ఎక్కువ దృష్టి సారించడం, తెలుగు భాష అభివృద్ధి కోసం తగిన చర్యలు చేపట్టలేదనే విమర్శలు ఎక్కువగా వినిపించాయి. దీంతో తెలుగు భాషకు సంబంధించిన అంశాల్లో పారదర్శకత మరియు ప్రజలకు అందుబాటులో ఉంచే దృష్టి తో సీఎం చంద్రబబు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

Gaza Strip : గాజాను మా ఆధీనంలోకి తీసుకుంటాం.. ట్రంప్ సంచలన ప్రకటన

అధికారిక ఉత్తర్వులు మరియు జీవోల విడుదలలో పారదర్శకత పెంపొందించేందుకు, ఇప్పుడు ప్రతి జీవోను ఇంగ్లిష్ తో పాటు తెలుగు భాషలో కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం భాషా అంతరాయాలను తొలగించి, రాష్ట్రంలోని ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకునేలా చేయడానికి తీసుకోబడింది. దీని ద్వారా తెలుగు భాషలో ప్రభుత్వ పనులను ప్రజలకు చేరువ చేసే దిశలో ఒక మంచి మైలురాయి ఏర్పడుతుందని భావిస్తున్నారు. ముందుగా ఏపీ హోంశాఖలో ఖైదీ పెరోల్‌కు సంబంధించిన జీవోను తెలుగు భాషలో విడుదల చేసారు. గతంలో ఇంగ్లిష్ మాత్రమే అందుబాటులో ఉండటంతో, తెలుగు భాష మాట్లాడే విభాగాలకు అందుబాటులో లేకపోవడం వల్ల సమాచార అర్ధవంతతలో లోపం ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని తేలికగా అర్థం చేసుకునేలా ప్రభుత్వం చర్య తీసుకోవడం ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఇది కదా బాబు మార్క్ అంటే అంటూ ప్రశంసిస్తున్నారు.

  Last Updated: 05 Feb 2025, 12:37 PM IST