Ayodhya Temple Opening : అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన కీలక విషయం ఒకటి బయటికి వచ్చింది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22న జరగనుందని తెలిసింది. అనంతరం అయోధ్య ఆలయాన్ని భక్తుల సందర్శన కోసం తెరువనున్నారు. ఈవివరాలను ఓ ప్రముఖ జ్యోతిష్యుడు, అతని సోదరుడు చెప్పారంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల మధ్య అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఈ వేడుకకు ఐదు రోజుల ముందే రామాలయంలో సన్నాహక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, యగ్నాలు ప్రారంభమవుతాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అయోధ్యలో ఇంకో కొత్త ఆధ్యాత్మిక ప్రాజెక్టును కూడా చేపట్టబోతోంది. దేశంలోని ప్రసిద్ధ దేవాలయాల చరిత్రను ప్రదర్శించే మ్యూజియంను అయోధ్యలో నిర్మించడంపై రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది. అయోధ్యకు వచ్చే భక్తులకు దేశంలోని ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలపడమే ఈ మ్యూజియం లక్ష్యమని యోగి సర్కారు చెబుతోంది.
Ayodhya Temple Opening : అయోధ్య రామయ్య ప్రతిష్ఠాపనోత్సవం ఏ రోజో ఖరారైంది..!

Ayodhya Ram Temple