world cup 2023: జోరు పెంచిన రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్

మొదటి నాలుగు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచిన న్యూజిలాండ్ జట్టు చివరి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా జట్టు మళ్లీ పునరాగమనం చేసింది.

world cup 2023: మొదటి నాలుగు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచిన న్యూజిలాండ్ జట్టు చివరి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా జట్టు మళ్లీ పునరాగమనం చేసింది. కంగారూ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల విజయాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.ఇరు జట్లు ఈ రోజు ధర్మశాలలో అమీతుమీకి సిద్ధమయ్యాయి. న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కి దిగింది.

ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరంభం నుంచి ధాటిగా ఆడటం ప్రారంభించారు. టోర్నీలో మొదటి మ్యాచ్ ఆడుతున్న ట్రావిస్ హెడ్‌ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. నాలుగు సిక్స‌ర్లు, ఆరు బౌండ‌రీల సహాయంతో కేవ‌లం 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మ‌రో ఓపెన‌ర్ వార్న‌ర్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు సిక్సర్లతో కేక‌పుట్టించాడు. ఈ క్రమంలో వార్న‌ర్ మరో హాఫ్ సెంచ‌రీ నమోదు చేశాడు. వీరిద్దరి ధాటిగా ఆసీస్ 23 ఓవర్లకే 200 పరుగుల మైలురాయికి చేరుకుంది. డేవిడ్‌ వార్నర్‌ 65 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ లో డేవిడ్ భాయ్ 6 సిక్సర్‌లు, 5 ఫోర్‌లు బాదాడు. ట్రావిస్‌ హెడ్‌ 67 బంతుల్లో 109 పరుగులతో కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ (41), జోష్ ఇంగ్లిస్ (38), కెప్టెన్ పాట్ కమిన్స్ (37) పరుగులతో ఆకట్టుకున్నారు. ఆసీస్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌కు 389 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా జట్టు మొత్తం 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది.

లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన కివీస్ కు ఆరంభం ఫర్వాలేదనిపించినా ఓపెనర్లిద్దరూ త్వరగానే అవుట్ అయ్యారు. హేజిల్‌వుడ్ ఓపెనర్లిద్దరినీ పెవిలియన్ చేర్చాడు.విల్ యంగ్ 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 32 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 17 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.దాంతో జట్టు బాధ్యతను రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ తీసుకున్నారు. ఆసీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటు పరుగులు రాబడుతున్నారు. డారిల్ మిచెల్ మిచెల్ హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, రచిన్ రవీంద్ర స్పీడు పెంచి ఆడుతున్నాడు. ఈ రోజు ఈ ఇద్దరు ఆటగాళ్లు స్టాండ్ ఇస్తే తప్ప న్యూజిలాండ్ గెలిచే పరిస్థితి కనిపించడం లేదు.

ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా మరియు జోష్ హేజిల్‌వుడ్.

న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ మరియు ట్రెంట్ బౌల్ట్.

Also Read: Spider in Ear : మహిళ చెవిలో సాలీడు పురుగులను చూసి ఖంగుతిన్న డాక్టర్స్