Atiq Ahmed: కరుడుగట్టిన నేరస్థుడు, రాజకీయ నేత అతిక్ అహ్మద్ వక్ఫ్, ఇమాంబారా, శ్మశానవాటికలోని అనేక ఆస్తులను అక్రమంగా ఆక్రమించుకున్నాడు. అధికారంలో ఉండి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడ్డాడు. మూడు వక్ఫ్ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నాడు.
అతిక్ అహ్మద్ హత్యకు గురై నెల కావొస్తున్నా ఇంకా అతని పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల ఆయనను ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రి వద్ద కాల్చి చంపేసిన విషయం తెలిసిందే. అతిక్ మరణాంతరం అతను చేసిన దారుణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా అతిక్ కబ్జా ఒకటి వెలుగు చూసింది. అతిక్ అహ్మద్ ఇళ్లు, ప్లాట్లను కబ్జా చేయడమే కాకుండా ప్రయాగ్‌రాజ్‌లోని మూడు చోట్ల వక్ఫ్ ఆస్తులను కూడా కబ్జా చేశాడు. ఇందుకు నిరసన తెలిపిన వ్యక్తిని అక్రమ కేసులో ఇరికించి వేధించారు. ప్రస్తుతం ఆ కేసు సీబీఐ విచారణకు సిఫార్సు చేయబడింది.
బహదుర్‌గంజ్‌లో రెండు వందల ఏళ్ల ఇమాంబర గులాం హైదర్‌ను అతిక్ కబ్జా చేశాడు.నిజానికి ఇది వక్ఫ్ బోర్డు ఆస్తి. 2015లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ హయాంలో షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో ఉన్న ఇమాంబరాను ఆక్రమించాలనే ఉద్దేశ్యంతో అతిక్ అహ్మద్ తన సన్నిహితుడైన వకార్ రిజ్వీని మేనేజర్‌గా నియమించాడు. దీంతో అతను ఇమాంబర భవనాన్ని కూల్చివేయడం ప్రారంభించారు. నూతన భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. ముందు భాగాన్ని కూల్చివేసి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. ఇమాంబారాకు వెళ్లాలంటే ప్రజలు షాపింగ్ కాంప్లెక్స్ గుంపు గుండా వెళ్లాల్సి వచ్చింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపుల కేటాయింపులో అతిక్ ముఠా రూ.30 కోట్లకు పైగా కాజేసింది. ఇలాంటి దారుణాలు ఒక్కొక్కటి బయటపడుతూనే ఉన్నాయి.
Read More: The Elephant Whisperers: మాహీతో “ది ఎలిఫెంట్ విస్పర్స్” టీమ్