Site icon HashtagU Telugu

Teachers Dress Code: ఇకపై ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్… ప్రభుత్వం కీలక నిర్ణయం

Teachers Dreess Code

Uniform For Teachers A New Trend 1

Teachers Dress Code: అస్సాం ప్రభుత్వం ఉపాధ్యాయుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు ఇకపై తమకు నచ్చిన దుస్తులు వేసుకోరాదని, ప్రభుత్వం నిర్ణయించిన డ్రెస్ కోడ్ ని మాత్రమే ధరించాలంటూ ఉత్తర్వులు జరీ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి దుస్తులు ధరించరాదు అనేది స్పష్టంగా పేర్కొంది.

అస్సాం ప్రభుత్వం శనివారం రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్‌ను జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు టీషర్టులు, జీన్స్, లెగ్గింగ్‌లు ధరించి పాఠశాలకు రాలేరు. ప్రభుత్వం ఈ దుస్తులపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉపాధ్యాయులు సాదా రంగుల ఫార్మల్ దుస్తులతో మాత్రమే తరగతికి హాజరవ్వాలని పేర్కొంది. విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు ప్రభుత్వ ఉత్తర్వులను ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

పురుషులు (ఉపాధ్యాయులు) ప్యాంట్‌ షర్టులు ధరించి పాఠశాలకు రావాలి.
మహిళా ఉపాధ్యాయులు సల్వార్ సూట్, చీర, మేఖేలా-చాదర్ ధరిస్తారు.
టీ-షర్టులు, జీన్స్ మరియు లెగ్గింగ్స్ వంటి దుస్తులు నిషేధించబడ్డాయి.
పురుష, మహిళా ఉపాధ్యాయులు మర్యాదపూర్వకమైన దుస్తులు ధరించి విధులు నిర్వర్తించాలని, రంగురంగుల దుస్తులు ధరించరాదని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Read More: International Tea Day: మే 21న ప్రపంచ టీ దినోత్సవం.. 20 గ్రాముల టీ ఖరీదు 23 లక్షలా?