CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పద్మశాలి మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణన ద్వారా బీసీలకు న్యాయం చేయాలన్నదే రాహుల్ గాంధీ ఆశయం అని, దానిని ఎట్టి పరిస్థితులలోనూ నెరవేరుస్తామని ఆయన అన్నారు. రైతులకు ఇస్తున్నట్టు పద్మశాలీలకు కూడా సమాన ప్రాధాన్యత తమ ప్రభుత్వం ఇస్తోందని, ఎనికల్లో తమకు అండగా నిలబడిన నేతన్నలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు, అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే రెండు చీరల తయారీకి సంబంధించిన రూ. 1.30 కోట్ల ఆర్డర్ ను నేతన్నలకు ఇచ్చామని తెలియజేశారు.
Read Also: Milk: పాలు తాగితే బరువు పెరుగుతార.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
ఆసిఫాబాద్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టనున్నట్టు ప్రకటించారు. తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్యం బాపూజీ అనేక త్యాగాలు చేశారని కొనియాడారు. తెలంగాణ కోసం ఎన్నో చేశాం అని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులు ఆయన చనిపోతే కనీసం చూడటానికి కూడా వెళ్లలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో రైతులతో పాటు నేతన్నలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల్లోని స్త్రీలకు రెండు చీరల చొప్పు ఇస్తామని వెల్లడించారు. నేతన్నలకు రూ.1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్లు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎనికల్లో తమకు అండగా నిలబడిన నేతన్నలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
పద్మశాలీలు ఆత్మగౌరవంలోనే కాదు, త్యాగంలోనూ ముందుటారని అలాంటి పద్మశాలీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా పద్మశాలీలను అభ్యున్నతే లక్ష్యమే మా ప్రభుత్వం విధానం అన్నారు. టైగర్ నరేంద్ర త్యాగం లేకుండా మలిదశ తెలంగాణ ఉద్యమం ముందుకు సాగలేదనేది నిజం అన్నారు. అలాంటి ఆలె నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా చేస్తే కేసీఆర్ అనే ధృతరాష్ట్రడు అలె నరేంద్ర పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకోవడమే కాకుండా ఆయనను ఖతం చేసిన కథ పద్మశాలీలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ పద్మశాలీలను రాజకీయంగా ప్రోత్సహించిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ , పద్మశాలీ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: BRS : కేసీఆర్ అధ్యక్షతన 11న బీఆర్ఎస్ శాసన సభాపక్ష భేటీ