Chicken: ఇకపై కోడి కోయకుండానే చికెన్ రెడీ.. తినడానికి సిద్ధంగా ఉండండి?

మామూలుగా చికెన్ కావాలి అంటే కోడిని కోయాల్సిందే. కోడిని కోస్తేనే తప్ప మనకు చికెన్ రాదు. కానీ ఇక మీదట మాత్రం కోడిని కోయకుండానే చికెన్ ను తినవచ్

  • Written By:
  • Publish Date - June 26, 2023 / 05:05 PM IST

మామూలుగా చికెన్ కావాలి అంటే కోడిని కోయాల్సిందే. కోడిని కోస్తేనే తప్ప మనకు చికెన్ రాదు. కానీ ఇక మీదట మాత్రం కోడిని కోయకుండానే చికెన్ ను తినవచ్చు. కోడిని కోయకుండా చికెన్ ను ఎలా అని అనుకుంటున్నారా! అవునండోయ్ ఈ విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి కోడి వంటి మూగ పక్షులను చంపకుండా కృత్రిమ చికెన్‌ను తయారు చేశారు. అవును మీరు విన్నది చదివింది నిజమే. ప్రపంచంలోనే తొలిసారి ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్‌ అందుబాటులోకి వచ్చింది. దాంతో ఇక మీదట చికెన్‌ తినాలంటే కోడిని కోయాల్సిన పనిలేదన్నమాట.

ప్రపంచంలో తొలిసారి ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్‌ను అమ్ముకోవడానికి అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్‌ అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా రెండు కంపెనీలు అనుమతులు దక్కించుకున్నాయి. దీంతో అమెరికాలో రెస్టారెంట్ లో ఈ ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా త్వరలోనే ఈ చికెన్‌ను సూపర్‌ మార్కెట్లలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంతకీ ఈ కృత్రిమ చికెన్‌ను ఎలా తయారు చేస్తారనేగా మీ సందేహం. ఇందుకోసం శాస్త్రవేత్తలు కోళ్ల కణ జాలాన్ని స్టీల్‌ ట్యాంకుల్లో అభివృద్ధి చేస్తారు. కోడి మూలకణాల నుంచి ఈ చికెన్‌ను తయారు చేస్తారు. కోడి నుంచి వచ్చే కణాలకు పోషకాలు అందిస్తారు.

దీంతో నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఈ కణాలు మాంసంగా మారుతాయి. అంతేకాకుండా పోషకాల విషయంలో ఏమైనా తేడా ఉండదు. కృత్రిమ చికెన్ లో జంతు మాంసంతో సమానంగా పోషకాలు ఉంటాయి. అంతేకాదు అవసరమైతే పోషకాల మోతాదును పెంచుకోవచ్చు. ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా పోషకాలను మార్చుకోవచ్చు. కొవ్వు, కొలెస్ట్రాల్‌ను తగ్గించుకుంటూ మాంసాన్ని నచ్చిన విధంగా మార్చుకోవచ్చు.