AP Special Status : కొడాలి నానికి అరెస్ట్ వారెంట్ జారీ..

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే కారణంగా కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో 55 మందిపై ఐపీసీలోని సెక్షన్లు 341, 188, 290 రెడ్‌ విత్‌ 34 కింద కేసు నమోదయింది

Published By: HashtagU Telugu Desk
AP Special Status

Kodali

ఏపీకి ప్రత్యేక హోదా (AP Special status) కోరుతూ విజయవాడ బస్టాండ్‌ ఎదుట వైసీపీ పార్టీ (YCP) ఆధ్వర్యంలో 2015 లో కొంతమంది ధర్నా చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే కారణంగా కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో 55 మందిపై ఐపీసీలోని సెక్షన్లు 341, 188, 290 రెడ్‌ విత్‌ 34 కింద కేసు నమోదయింది. ఇందులో ఏ1గా కొలుసు పార్థసారథి (Pardasaradi), ఏ2గా కొడాలి నాని (Kodali Nani ), ఏ3గా వంగవీటి రాధా (Vangaveeti Radha) పేర్లతో పాటు మరో 52 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

ఈ కేసుపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణకు ఇంతవరకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి అరెస్టు వారెంట్ (Arrest Warrant) జారీ చేశారు. కొడాలి నాని, పార్థ సారథితో పాటు వంగవీటి రాధాకు కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వీరిలో కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్‌లో ఉంది. వాయిదాలకు కొడాలి నాని రాకపోవడంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also : Brahmotsavam: ఈ నెల 17న శ్రీవారి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

టీడీపీ (TDP) పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా అంశంపై విపరీతంగా పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కొడాలి నాని 2015లో విజయవాడ నగరంలో ఒక ర్యాలీ నిర్వహించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారధితో పాటు ఇంకొందరితో ర్యాలీ చేశారు. అనుమతి లేకున్నా కూడా వన్ వేలో ఈ ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసుల ఉత్తర్వులను ఉల్లంఘించి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారని ఆరోపణలతో అప్పుడు కొడాలి నానిపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసు విచారణకు కొడాలి నాని సహా ర్యాలీలో పాల్గొన్నవారు కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

  Last Updated: 13 Sep 2023, 10:53 AM IST