Site icon HashtagU Telugu

Non-Bailable Arrest Warrant : ఏపీ మంత్రి రోజా భర్తకు షాక్ ఇచ్చిన కోర్ట్..

Non-bailable arrest warrant issued against Roja husband

Non-bailable arrest warrant issued against Roja husband

ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సినీ నటి రోజా (AP Minister Roja) భర్త సెల్వమణి (RK Selvamani) కి చెన్నై కోర్టు (Chennai Georgetown Court) భారీ షాక్ ఇచ్చింది. 2016లో ఓ తమిళ ఛానెల్‌కి సెల్వమణి ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఇందులో తనను కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఓ సినీ ఫైనాన్షియర్‌ ఆరోపిస్తూ కోర్ట్ లో పిర్యాదులు చేసారు. ఈ క్రమంలో చెన్నై కోర్టు సెల్వమణి కి అరెస్ట్ వారెంట్ చేసింది. రోజా భర్త తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి గుర్తింపు తెచ్చుకున్నారు.

Read Also : Vijayawada MP Seat : జగన్ మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా..?

ప్రస్తుతం సెల్వమణి.. 2022-24 సంవత్సరాలకుగాను దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడుగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా 2016లో చెన్నైలో ఓ తమిళ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు సెల్వమణి. ఆ ఇంటర్వ్యూలో తనను కించపర్చేలా మాట్లాడారంటూ సెల్వమణిపై సినీ ఫైనాన్షియర్‌ ముకుంద్‌ చంద్ బోత్రా (Financier Mukund Chand Bothra) .. కోర్టులో పరువునష్టం దావా కేసు వేశారు. కోర్టులో కేసు వేసిన ముకుంద్ చంద్ బోత్రా మృతి చెందారు. అయితే ఇప్పుడు ఆ కేసును ముకుంద్ కొడుకు గగన్‌ బోత్రా (Gagan Bothra) కొనసాగిస్తున్నారు.

ఈ కేసు విచారణ సోమవారం జరిగినప్పటికీ సెల్వమణి హాజరుకాలేదు. గతంలోనూ సెల్వమణి విచారణకు దూరంగా ఉన్నారు. అతనికి సంబంధించిన లాయర్లు కూడా కోర్టుకు రాలేదు. దీంతో సెల్వమణి తీరుపై చెన్నై జార్జిటౌన్ కోర్టు సీరియస్‌ గా రియాక్ట్ అయింది. దీంతో సెల్వమణికి కోర్టు నాన్ బెయిల్‌బుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మరి దీనిపై రోజా కానీ , సెల్వమణి గానీ ఇంకా స్పందించలేదు.