Site icon HashtagU Telugu

Hyderabad : బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్..

Medchal Brs

Medchal Brs

తెలంగాణ లో మరోసారి అరెస్టులు , ఆందోళనలు , ధర్నాలతో టెన్షన్..టెన్షన్ గా మారింది. గత రెండు వారాలుగా నిరుద్యోగులు ప్రభుత్వం ఫై ఆగ్రహం తో సమ్మెలు , రాస్తారోకో , ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈరోజు బిఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్ మేడ్చల్ లో ఉద్రిక్తతకు దారితీసింది. పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబ‌ర్ 1లో ఉన్న భారీ నిర్మాణాల‌ను అధికారులు కూల్చి వేత్తను బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అడ్డుకోవడంతో వారిని అరెస్ట్ చేసారు. ఈ క్రమంలో అక్కడ బిఆర్ఎస్ శ్రేణులకు , అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై పీర్జాదిగుడా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

పీర్జదిగూడా మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కార్పొరేటర్ అమర్ సింగ్ ను మేయర్ చేయాలని, అక్రమస్తులను కూడబెట్టుకోవాలని కుట్రలో బాగామే ఈ కూల్చివేతలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మా నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నాము మా నిర్మాణాలకు హెచ్ ఎండీఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అని అనుమతులు ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మా‌ నిర్మాణాలను కూల్చి వేయిస్తున్నారని బాధితులు అంటున్నారు.

Read Also : Rahul – Revanth : ప్రధాని పదవికి ఒక్క అడుగు దూరంలో రాహుల్‌గాంధీ : సీఎం రేవంత్