Siachen: సియాచిన్ హిమానీనదంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఆర్మీ అధికారి మృతి చెందగా, ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. గాయపడిన సైనికులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. వివరాలలోకి వెళితే..
బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో సియాచిన్ హిమానీనదంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక అధికారి ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు సైనికులు గాయపడ్డారు. క్షతగాత్రులను అక్కడి నుంచి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన సైనికులు పొగ పీల్చడం ద్వారా స్వల్ప అస్వస్థకు గురయ్యారు. మిగతా వారు కాలిన గాయాలతో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. దురదృష్టకరం ఏంటంటే..కాలిన గాయాలతో రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్ కెప్టెన్ అన్షుమాన్ సింగ్ మరణించాడు.
Read More: Mutton Dalcha: ఎంతో స్పైసీగా ఉండే మటన్ దాల్చా.. తయారుచేసుకోండిలా?