Bhadrachalam : ఏనుగుల దాడిలో ఆర్మీ జవాన్ మృతి

Bhadrachalam : ఏనుగుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సాయిచంద్రరావు కిందపడిపోగా, ఏనుగులు అతని పై దాడి చేసి ప్రాణాలు కోల్పోయేలా చేశాయి

Published By: HashtagU Telugu Desk
Armyjawan Dies

Armyjawan Dies

భద్రాచలం (Bhadrachalam ) అశోక్‌నగర్‌కు చెందిన ఆర్మీ జవాన్ (Army Jawan) కొంగా సాయిచంద్రరావు (Konga Saichandra Rao) అస్సాంలో ఏనుగుల దాడి (Elephant attack)లో దుర్మరణం చెందారు. ఈ దారుణ సంఘటన అసోంలోని అమ్రిబారిలో చోటుచేసుకుంది. ఏనుగుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సాయిచంద్రరావు కిందపడిపోగా, ఏనుగులు అతని పై దాడి చేసి ప్రాణాలు కోల్పోయేలా చేశాయి.

సాయిచంద్రరావు సుబేదార్‌గా సోనిత్‌పూర్ జిల్లా రంగాపారాలో విధులు నిర్వహిస్తూ దేశ సేవలో ఉన్నారు. అతని మృతదేహాన్ని ఆర్మీ అధికారులు భద్రాచలానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయిచంద్రరావు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు, ఈ విషాద ఘటన కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలోకి నెట్టింది. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన సాయిచంద్రరావుకు సంతాపం తెలుపుతూ… అతని త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పలువురు నివాళులు అర్పిస్తున్నారు.

Read Also : Rahul Gandhi : ఇప్పుడు చెయ్యమను తెలంగాణలో రాహుల్ యాత్ర ..? – బండి సంజయ్

  Last Updated: 05 Nov 2024, 04:07 PM IST