ఇటీవలి కాలంలో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ స్కామ్ (QR Code Scanning Scam) లు కూడా కనిపిస్తున్నాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వారి బ్యాంకు ఖాతాలను సైబర్ నేరస్థులు ఖాళీ చేస్తున్నారు.
స్కామ్ (Scam) ఇలా:
OLX తదితర ప్లాట్ ఫామ్ ల వేదికలపై ఇలాంటి క్యూఆర్ కోడ్ స్కామ్ (QR Code Scam) స్టర్స్ ను గుర్తించొచ్చు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే, మనం ఏదైనా ఉత్పత్తి విక్రయానికి పెట్టామనుకోండి. దాన్ని చెప్పిన ధరకే కొనుగోలు చేస్తానంటూ సైబర్ నేరస్థుడు సంప్రదిస్తాడు. వాట్సాప్ ద్వారా ఓ క్యూఆర్ కోడ్ పంపిస్తాడు. దాన్ని స్కాన్ చేయండి, అమౌంట్ మీ ఖాతాలో జమ అవుతుందని చెబుతాడు. ఆ మాటలు నమ్మి స్కాన్ చేస్తే, మన ఖాతాలో ఉన్న మొత్తాన్ని నేరగాళ్లు బదిలీ చేసుకుంటారు.
మోసం బారిన పడకుండా ఉండాలంటే?
మన యూపీఐ ఐడీ, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఎవరికైనా ఏదైనా ఉత్పత్తి విక్రయించాలని నిర్ణయించుకుంటే నగదు రూపంలోనే తీసుకోవాలి. డబ్బులు చెల్లింపులకే కానీ, డబ్బుల స్వీకరణకు యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ అవసరం ఉండదు. ఒక క్యూఆర్ కోడ్ పై మరో క్యూఆర్ కోడ్ స్టిక్కర్ పేస్ట్ చేసి ఉన్నట్టు గమనిస్తే, చెల్లింపులు చేయకుండా ఉండడం మంచిది. డబ్బులు చెల్లింపులకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే వారు, స్కాన్ అయిన తర్వాత వచ్చే వ్యక్తి లేదా సంస్థ పేరు, తదితర వివరాలను నిర్ధారించుకోవాలి. ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దు.
Also Read: Water Bottle Fine : వాటర్ బాటిల్ పై రూ.5 ఎక్కువ వసూలు చేసినందుకు లక్ష ఫైన్!