YCP : దూకుడు పెంచిన జగన్..పలు జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షుల నియామకం

YCP : ప్రతి రోజు ఎవరొకరు పార్టీని వీడుతుండడం తో ఇంకా సైలెంట్ గా ఉంటె మొదటికే మోసం వస్తుందని గ్రహించిన జగన్..పార్టీని బలోపేతం ఫై దృష్టి సారించారు

Published By: HashtagU Telugu Desk

Appointment of party presidents for Districts : అసెంబ్లీ ఎన్నికల్లో భారీ షాక్ తిన్న జగన్ (Jagan)..ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే పనిపై దృష్టి సారించారు. ఎన్నికల ఫలితాల తర్వాత వరుసపెట్టి పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఫలితాలతో జగన్ కూడా సైలెంట్ అవ్వడం తో పార్టీ ని నమ్ముకుంటే కుదరదని చెప్పి ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేయడం మొదలుపెట్టారు.

ముఖ్య నేతలే బయటకు వెళ్తుండడం తో కింది స్థాయి నేతలు సైతం పక్క పార్టీల్లోకి జంప్ అవ్వడం స్టార్ట్ చేసారు. ప్రతి రోజు ఎవరొకరు పార్టీని వీడుతుండడం తో ఇంకా సైలెంట్ గా ఉంటె మొదటికే మోసం వస్తుందని గ్రహించిన జగన్..పార్టీని బలోపేతం ఫై దృష్టి సారించారు. అందులో భాగంగా పలు జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షులు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ నియామకాలను చేపట్టారు. జ‌గ‌న్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు
కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పేర్ని నాని
ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్‌
రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్‌
గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాలరెడ్డి
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఇక నుండి వీరంతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో బిజీ కానున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించారని..గత వైపీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన నేతలు వెంటనే.. కౌంటర్ ఎటాక్ లు ప్రారంభించారు. తిరుమల తిరుపతిని కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

Read Also :  Heart Attack : వెన్నులోని ఈ భాగంలో నొప్పి గుండెపోటుకు సంకేతం

  Last Updated: 25 Sep 2024, 11:00 PM IST