Site icon HashtagU Telugu

Apple Credit Card : త్వరలో యాపిల్ పే.. యాపిల్ క్రెడిట్ కార్డ్ !!

Credit Card Disadvantages

Credit Card Disadvantages

ఇప్పుడు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ట్రెండ్ నడుస్తోంది.

ఈ బిజినెస్ లోకి ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ కూడా ఎంటర్ కానుంది.

ఇండియాలో క్రెడిట్ కార్డులు ఇష్యూ చేసేందుకు యాపిల్ రెడీ అవుతోంది.

త్వరలోనే HDFC బ్యాంక్‌తో కలిసి క్రెడిట్ కార్డులను Apple జారీ చేసే ఛాన్స్ ఉంది.

యాపిల్ కంపెనీ ఇండియాలో “యాపిల్ కార్డ్” (Apple Card) పేరుతో క్రెడిట్ కార్డ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ తో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. వీటిపై ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (RBI) యాపిల్ చర్చలు జరిపింది. ఏప్రిల్‌లో భారతదేశంలో పర్యటించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓ, ఎండీ శశిధర్ జగదీషన్‌ను కూడా కలిశారని సమాచారం. దేశంలో “యాపిల్ పే”ని ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తోనూ యాపిల్ చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. అయితే యాపిల్ క్రెడిట్ కార్డ్ ఎన్‌పీసీఐకి చెందిన రూపే ప్లాట్‌ఫారమ్ ద్వారా వస్తుందా? లేక యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) కోసమా అనే దానిపై క్లారిటీ లేదు.

ఇప్పటికే అమెరికాలో యాపిల్ కార్డ్ (Apple Card)..

ఇప్పటికే యాపిల్ కార్డ్ అమెరికాలో ఉంది. యాపిల్ కార్డ్ (Apple Card) యాపిల్ పేతో అనుసంధానించబడింది. యాపిల్ వ్యాలెట్‌లో జమ చేసే డబ్బుకు 4.15 శాతం వడ్డీ లభిస్తుంది. యాపిల్ కార్డుకు యాన్యువల్ ఫీజ్ ఉండదు. యాపిల్ కార్డుతో వడ్డీ లేకుండా యాపిల్ ప్రొడక్ట్స్ ఈఎంఐలో కొనొచ్చు. యాపిల్ ఉత్పత్తులు, యాపిల్ సేవలకు చేసే ఖర్చుపై 3 నుంచి 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. యాపిల్ టైఅప్ చేసుకున్న ప్రీమియం బ్రాండ్లకు జరిపే ఖర్చులపై 2 నుంచి 3 శాతం క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, యాపిల్ తీసుకొచ్చే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ తీసుకునే వారికి లేట్ పేమెంట్ ఫీజు ఉండదు. అయితే వారు వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.

ఆపిల్‌ అనేది బ్యాంక్‌ కాదు కదా?

ఆపిల్‌ కంపెనీ బ్యాంక్‌ కాదు కదా.. మరి క్రెడిట్‌ కార్డ్‌ ఎలా జారీ చేస్తుంది? ఈ డౌట్‌ మీకూ వచ్చిందా?. క్రెడిట్‌ కార్డ్స్‌ జారీ చేసే అధికారం బ్యాంకులకు మాత్రమే ఉంది. కాబట్టే HDFC బ్యాంక్‌తో ఆపిల్‌ మాట్లాడుతోంది. ఇండియాలో లాంచ్‌ చేసే ఆపిల్‌ క్రెడిట్‌ కార్డ్‌ మీద Apple లోగో ఎక్కడా కనిపించదు. HDFC బ్యాంక్‌, రూపే పేరిటే అవి జారీ అవుతాయి. USలోనూ సేమ్‌ సీన్‌. Apple కార్డ్‌లో గోల్డ్‌మన్ సాచ్స్ & మాస్టర్ కార్డ్ బ్రాండ్ పేర్లు మాత్రమే కనిపిస్తాయి.

Also Read:  IND Vs WI: జులై 12 నుంచి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. ఆ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికి..?