Site icon HashtagU Telugu

Apple Products at Low Price : తక్కువ ధరలో యాపిల్ ప్రొడక్ట్స్

Apple Products E Comers

Apple Products E Comers

కొత్త సంవత్సరం సందర్భంగా ప్రధాన ఇ-కామర్స్ (E-Comers) సైట్‌లలో విక్రయాలు నిర్వహించబడుతున్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ ఫోన్ లేదా ల్యాప్‌ టాప్ కొనాలని చూస్తున్నట్లయితే.. మీకు ఇదే గొప్ప అవకాశం. ఎలక్ట్రానిక్స్ రిటైల్ స్టోర్ విజయ్ సేల్స్ ప్రత్యేక సేల్ నిర్వహించింది. డిసెంబర్ 31 వరకు జరిగే ఈ సేల్‌లో ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ విజయ్ సేల్స్‌ లో మీరు iPhone 14 ని కేవలం రూ. 61,900 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బేస్ ధర రూ.79,900. కానీ, మీరు HDFC బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే, మీకు 5 వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది. అలాగే, దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

ఈ సేల్‌ లో స్మార్ట్‌ వాచ్‌లు, ఎయిర్‌ పాడ్స్ ప్రో, మాగ్‌ సేఫ్ ఛార్జింగ్ కేసులు, మ్యాక్‌ బుక్స్, ఐప్యాడ్‌ లు మరియు యాపిల్ (Apple) యాక్సెసరీస్‌ పై కూడా డీల్‌ లను అందిస్తుంది. ఐఫోన్ 14కి రూ.61,900, ఐఫోన్ 14 ప్లస్ రూ. 68,699, ఐఫోన్ 14 ప్రో రూ.1,26,100, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ రూ.135,800, ఐఫోన్ 12 రూ.52,900, ఐఫోన్ 13 ధర రూ.62,900తో మొదలవుతుంది. ఐప్యాడ్ గురించి చెప్పాలంటే.. ఐప్యాడ్ 9 జనరేషన్ ప్రారంభ ధర రూ.25,600. కాబట్టి మీరు ఐప్యాడ్ ప్రోని రూ.73,000 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ ల్యాప్‌ టాప్‌ లు కూడా చౌకగా అమ్మకానికి లభిస్తాయి. M1 చిప్‌తో కూడిన మ్యాక్‌ బుక్ ఎయిర్ ప్రారంభ ధర రూ. 77,900, M2 చిప్‌తో కూడిన మ్యాక్‌ బుక్ ఎయిర్‌ను రూ. 95,500, M2 చిప్‌తో కూడిన మ్యాక్‌ బుక్ ప్రో రూ. 1,04,300, మ్యాక్‌ బుక్ ప్రోతో M1 ప్రో చిప్ రూ. 1,07,500గా ఉంది. విజయ్ సేల్స్ ఆపిల్ వాచ్‌పై బంపర్ తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ సేల్‌ లో యాపిల్ (Apple) వాచ్ 8 ప్రారంభ ధర రూ.39,900 ఉంది. యాపిల్ వాచ్ ఎస్‌ఈ (2వ తరం) ధర రూ.26,000 నుంచి ప్రారంభం కాగా, యాపిల్ వాచ్ అల్ట్రా ధర రూ.82,300 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే.. కంపెనీ Apple Care+పై అదనంగా 20 శాతం తగ్గింపును అందిస్తోంది.

Also Read:  Sleeping Positions : మీరు పడుకునే పోసిషన్ ని సరిచూసుకోండి..