Site icon HashtagU Telugu

AP Governor Abdul Nazeer : చంద్రబాబు అరెస్ట్ ఫై గవర్నర్ నజీర్ ఆశ్చర్యం

Ap Governor Abdul Nazeer Sh

Ap Governor Abdul Nazeer Sh

ఏపీ మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (Skill Development Case) కేసులో చంద్రబాబు ను CID అధికారులు నంద్యాల లో అరెస్ట్ చేసారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన విజయవాడ కుంచనపల్లి సిట్ ఆఫీస్ కు తీసుకొచ్చారు. ఈ కేసులో చంద్రబాబును A-1గా సీఐడీ పేర్కొంది. కాగా చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP governor Abdul Nazeer) ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

మాజీ సీఎం, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ను అరెస్ట్ (Chandrababu Arrest) చేయాలంటే..అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ(సి) ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి కానీ అవేమి లేకుండానే CID చంద్రబాబు ను అరెస్ట్ చేసారు. చంద్రబాబు అరెస్ట్ అనేది తెలిసి గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మాట వరసకైనా సమాచారం ఇవ్వకపోవడంపై గవర్నర్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. 2018లో చేసిన చట్ట సవరణ తర్వాత గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే. కానీ, ప్రస్తుత గవర్నర్, 2021లో కేసు నమోదు చేసినప్పుడు ఉన్న గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం. మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే గవర్నర్ తెలుసుకోవడం జరిగిదంటే..జగన్ ప్రభుత్వం చట్టాన్ని ఎంతలా తమసొంతానికి వాడుకుంటుందో అర్ధం అవుతుంది.

Read Also : CBN Vote for Note Advocate : చంద్ర‌బాబు కేసు వాదించే అడ్వ‌కేట్ లూథ్రా ఎవ‌రు?

ఇదిలా ఉంటే చంద్రబాబు బెయిల్ కోసం టీడీపీ లీగల్ సెల్ ముమ్మర ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు ఢిల్లీ నుంచి సుప్రీం కోర్టు సీనియర్ లాయర్‌ సిద్ధార్థ్ లూథ్రా (Sidharth Luthra) ను రంగంలోకి దించింది. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు సిద్ధార్థ్ లూథ్రా, ఆయన జూనియర్లు చేరుకున్నారు. చంద్రబాబు తరపున కేసులు మొదటి నుంచి సిద్ధార్థ్ లూథ్రానే వాదిస్తున్నారు. తాజా కేసులో కూడా ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున బెయిల్ పిటిషన్‌పై సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వివరాలను ఇప్పటికే స్థానికంగా ఉన్న న్యాయవాదులు లూథ్రాకు అందించారు. ఆయనతో పాటు ఈ కేసులో వాదనలు వినిపించేందుకు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు సిద్ధంగా ఉన్నారు.