తెలంగాణ గత ప్రభుత్వ హయాం(BRS)లో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)వ్యవహారం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu), ఆయన కుమారుడు నారా లోకేష్, టిడిపి నేత అచ్చెన్నాయుడుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయని తెలుస్తోంది. అంతే కాకుండా వీరికి సన్నిహితంగా ఉన్న మరికొంతమంది వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Air India Plane Crash: విమాన ప్రమాదంలో క్రికెటర్ దుర్మరణం.. ఆలస్యంగా వెలుగులోకి!
ఈ ట్యాపింగ్ చర్యలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ కీలక వ్యక్తి ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్ రావు అనే అధికారి అమలు చేశారని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ట్యాప్ చేసిన డేటా ప్రత్యేకంగా ఓ చిప్‌లో భద్రపరిచి ప్రభుత్వ పెద్దలకు అందజేస్తూ, వాట్సాప్ కాల్స్, ఆడియోలకూడా ట్రాక్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డేటా చిప్‌ను అప్పటి ఏపీ సీఎం జగన్‌కు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు తీసుకెళ్లినట్టు కూడా కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే రాజ్యాంగ పరంగా ఇది తీవ్రమైన నేరంగా మారుతుందన్నది న్యాయవేత్తల అభిప్రాయం.
Iran-Israeli War : టెహ్రాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు అడ్వైజరీ జారీ
ఈ నేపథ్యంలో కేంద్రం లేదా ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, సీబీఐతో దర్యాప్తు చేపట్టే అవకాశాలపై చర్చ నడుస్తోంది. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేతపై మరొక రాష్ట్ర ప్రభుత్వమే గూఢచర్యం చేయడం మామూలు విషయం కాదన్నది నిపుణుల వాదన. ఫోన్ తప్పింగ్ వ్యవహారం విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తే, బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా గట్టి దెబ్బతగలే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద ఈ కేసు మరింత మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. రేపటి రోజున వెలుగులోకి రాబోయే నిజాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపే అవకాశముంది.