డిసెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ (AP Cabinet Meeting) సమావేశం జరగనుంది. ఈ సమావేశం వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, ముఖ్యంగా ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్ కార్డులు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ అంశంపై కూడా చర్చించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసంబంధిత పథకాలు, మరియు ఆర్థిక విషయాలపై కూడా చర్చలు జరపనున్నారు.
ముఖ్యంగా, ఇసుక పాలసీపై చర్చ అతి ప్రాధాన్యంగా ఉంటుందని అంచనా. ఈ పాలసీ అమలు విషయంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, కొత్త మార్గదర్శకాల అవసరం, అక్రమ ఇసుక రవాణాపై తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలకు బలమైన ప్రోత్సాహకాలు అందించేందుకు కొత్తగా ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలు, ఇంతకుముందు ప్రకటించిన పథకాల అమలు పురోగతిపై చర్చ జరగనుంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ లో జరిగిన చర్చలు , కేంద్రమంత్రులతో సమావేశం తాలూకా అప్డేట్స్ తదితర అంశాలను కూడా మాట్లాడనున్నారు.
Read Also : YS Jagan Defamation: రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేయనున్న వైఎస్ జగన్!