సీఎం జగన్ (CM Jagan ) అధ్యక్షతన ఏపీ కేబినెట్ (AP Cabinet Meeting) సమావేశం బుధువారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చించారు. అలాగే మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ ఫై చర్చించారు.. సుమారు 6 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించింది.. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు సహా వివిధ పోస్టుల భర్తీ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు కేబినెట్ ఆమోదం తెలుపగా.. ఫిబ్రవరి నెలలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేయాలనీ భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు ఓకే చెప్పారు. మరోవైపు ఇంధన రంగంలో రూ.22 వేల కోట్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్నారు.
3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ కు ఆమోదం లభించింది.. దాదాపు 12,065 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నారు.. ఆగ్వాగ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.. 4 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.. ఇక, ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1350 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also : Manikkam Tagore Vs KTR : కేటీఆర్‌కు పరువు నష్టం దావా నోటీసులు పంపిన మాణిక్కం ఠాగూర్