Independence Day 2023 : ప్ర‌తి ఇంటిపై జాతీయ జెండా ఎగ‌రాలి.. ప్ర‌జ‌ల‌కు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వ‌రి విజ్ఞ‌ప్తి

ప్ర‌తి ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేయాలని పురందేశ్వరి ప్రజలను కోరారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలను

Published By: HashtagU Telugu Desk
Purandhareswari

Purandhareswari

ప్ర‌తి ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేయాలని పురందేశ్వరి ప్రజలను కోరారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలను పురస్కరించుకుని ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. యువకులు, భావి తరాలకు స్వాతంత్య్ర ఉద్యమ విశిష్టతను తెలియజేసేలా చేయూతనందించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ బీజేపీ పార్టీ కార్యాలయంలో విజయవాడ అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె. సుధీర్ బాబు నేతృత్వంలోని పోస్టల్ శాఖ అధికారుల బృందం పురంధేశ్వరిని క‌లిశారు. దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగాను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు పోస్ట‌ల్‌ డిపార్ట్‌మెంట్ తీసుకున్న చొరవను అధికారులు ఆమెకు తెలియజేశారు. పురంధేశ్వరికి జాతీయ పతాకాన్ని అందించి స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తున్న తపాలా శాఖ అధికారులను పురంధేశ్వరి అభినందించారు.

Also Read:  Ponduru Khadi- Mahatma Gandhi : పొందూరు ఖాదీ అంటే గాంధీజీకి మహా ఇష్టం.. ఎందుకు ?

  Last Updated: 12 Aug 2023, 08:26 AM IST