Virat and Anushka: మహా కాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించిన అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఆధ్యాత్మిక సేవలో తరించారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

Published By: HashtagU Telugu Desk
Virat

Virat

Virat and Anushka: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఇటీవల ఉజ్జయినిలోని మహకలేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ జంట ఇతర భక్తులతో పాటు ఆలయం లోపల కూర్చుని ఉండడం వీడియోలో చూడొచ్చు. విరాట్, అనుష్క ఇద్దరూ కలిసి పూజారులతో మాట్లాడడం చూడవచ్చు. అనుష్క లేత గులాబీ చీర ధరించగా, విరాట్ తెలుపు రంగు దుస్తులు ధరించాడు.  పూజారితో పలు విషయాలు మాట్లాడిన తర్వాత ఈ జంట పూజలు చేసినట్టు కనిపిస్తోంది.

అంతకుముందు, అనుష్క, విరాట్ ఉత్తరాఖండ్ బృందావన్ లోని దేవాలయాలను సందర్శించారు. వీరి వెంట కుమార్తె వామికా కూడా ఉన్నారు. విరాట్ కోహ్లీ ఇండోర్లో మూడవ టెస్ట్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మూడు రోజుల వ్యవధిలో ముగిసింది. ఆస్ట్రేలియా మూడవ టెస్ట్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం.. పలు కార్లు ధ్వంసం!

  Last Updated: 04 Mar 2023, 12:26 PM IST