మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డి ( Kakani Govardhan Reddy ) కి మరో షాక్ ఎదురైంది. నెల్లూరు జిల్లాలోని రుస్తుం మైన్స్ లో పేలుడు పదార్థాల వినియోగంపై గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అడిషనల్ సెక్షన్ల కింద ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసు మరింత కీలకంగా మారింది.
Anant Ambani : అనంత్ అంబానీ పాదయాత్ర ..అంత అవసరం ఏంటి..?
ఇప్పటికే మైనింగ్ కేసులో విచారణ కొనసాగుతుండగా, కాకాణి గోవర్థన్‌కు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో కేసు మరింత ఉత్కంఠగా మారింది. పోలీసుల దృష్టిలో ఆయనపై ఉన్న ఆరోపణలు బలమైనవిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Telangana Ministers : బీసీ సంఘాల మహాధర్నా.. రేపు ఢిల్లీకి మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు
కేసులో కొత్త అభియోగాలు నమోదు కావడంతో కాకాణి గోవర్థన్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టనుంది. బెయిల్ మంజూరు కావాలనే లక్ష్యంతో ఆయన న్యాయపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ కోణంలో కూడా ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. విచారణ ఎలా కొనసాగుతుందో, కోర్టు ఏమి తీర్పు ఇస్తుందో వేచిచూడాలి.