Encounter in UP: యూపీలో మరో ఎన్ కౌంటర్.. గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా హతం

జాతీయ రాజధాని ప్రాంతంలోని నోయిడా, ఘజియాబాద్ సహా పలు ప్రాంతాలలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అనిల్ దుజానా మీరట్‌లో పోలీసుల టాస్క్ ఫోర్స్ తో జరిగిన ఎన్‌కౌంటర్‌ (Encounter) లో మరణించాడు.

Published By: HashtagU Telugu Desk
Another Encounter In Up.. Gangster Anil Dujana Killed

Another Encounter In Up.. Gangster Anil Dujana Killed

Encounter in UP : ఉత్తరప్రదేశ్ లో మరో గ్యాంగ్‌స్టర్‌ హతమయ్యాడు. ఢిల్లీ – జాతీయ రాజధాని ప్రాంతంలోని నోయిడా, ఘజియాబాద్ సహా పలు ప్రాంతాలలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అనిల్ దుజానా మీరట్‌లో పోలీసుల టాస్క్ ఫోర్స్ తో జరిగిన ఎన్‌కౌంటర్‌ (Encounter) లో మరణించాడు. 60కి పైగా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న అనిల్ .. ఒక హత్య కేసులో బెయిల్ పొంది వారం క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ వెంటనే హత్య కేసులో కీలక సాక్షులలో ఒకరిని బెదిరించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. సాక్షిని హత్య చేయాలని దుజానా నిర్ణయించుకున్నాడని చెప్పారు. ఈవిషయం తెలియడంతో అప్రమత్తమైన పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ అతడిని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగింది. మీరట్‌లోని ఒక గ్రామంలో అనిల్ దుజానాను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా.. అతడి గ్యాంగ్ కాల్పులు జరిపింది. పోలీసుల ప్రతి కాల్పుల్లో అనిల్ చనిపోయాడు.

Also Read:  Manipur is Burning Today: మండుతున్న మణిపూర్

  Last Updated: 04 May 2023, 05:21 PM IST